Begin typing your search above and press return to search.
ఛోటాను తెచ్చేందుకు ప్రత్యేక విమానం!
By: Tupaki Desk | 5 Nov 2015 9:07 AM GMTమోస్ట్ వాంటెండ్ అండర్ వరల్డ్ డాన్.. పలు నేరాలకు సంబంధించి నిందితుడైన ఛోటా రాజన్ ను నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇండోనేషియాలోని బాలీలో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి జింబాబ్వే పారిపోయే క్రమంలో ఇండోనేషియా పోలీసులకు చిక్కాడు.
ఛోటా అరెస్ట్ వ్యవహారం ఒక్కసారిగా సంచలనం రేపింది. మొదట్లో అతగాడు భారత్ రావటానికి ఏమాత్రం ఇష్టపడలేదని.. తనను భారత్ కు పంపొద్దని వేడుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఛోటా రాజన్ ను భారత్ కు తీసుకొచ్చేందుకు భారత్ సర్కారు కలుగజేసుకొని ప్రయత్నాలు ఆరంభించటంతో ఛోటా రాజన్ ను భారత్ కు పంపటానికి అవసరమైన అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
మొదట అనుకున్నట్లుగా అయితే బుధవారం నాటికే ఛోటా భారత్ కు చేరాల్సి ఉంది. కానీ.. బాలీ సమీపంలోని అగ్నిపర్వతం పేలటం.. భారీగా దుమ్ము..ధూళి.. పొగ కమ్ముకోవటంతో బాలీ విమానాశ్రయాన్ని మూసి వేశారు. దీంతో.. అతగాడి తరలింపు ఆగిపోయింది. ప్రస్తుతం అగ్నిపర్వతం నుంచి వెలువడే దుమ్ము.. పొగ తగ్గిపోవటంతో ఛోటా తరలింపు మళ్లీ మొదలైంది.
బాలీ విమానాశ్రయంలో రాకపోకల్ని పునరుద్ధరించటంతో ఛోటాను తీసుకొచ్చేందుకు భారత్ అధికారులు ప్రత్యేకంగా ఒక విమానాన్ని బాలీ పంపారు. ప్రత్యేక విమానంలో ఛోటాను తీసుకొచ్చి.. నేర సామ్రాజ్యానికి సంబంధించి వివరాల్ని తెలుసుకోవాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.