Begin typing your search above and press return to search.

ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లు.. తన పార్టీ కోసం తెలంగాణ ప్రజల పైసలు ఖర్చు చేస్తున్న కేసీఆర్?

By:  Tupaki Desk   |   13 Dec 2022 5:35 AM GMT
ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లు.. తన పార్టీ కోసం  తెలంగాణ ప్రజల పైసలు ఖర్చు చేస్తున్న కేసీఆర్?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ తన వ్యక్తిగత పని మీద ఢిల్లీ వెళ్లారు. కానీ ఆయన తెలంగాణ సీఎం కావడంతో ఇదంతా అధికారికం కిందనే లెక్క. సో ఈ ఖర్చు తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది. కానీ ఆయన పర్యటన తన కొత్త పార్టీ 'బీఆర్ఎస్' కోసం కావడం గమనార్హం. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన జాతీయ పార్టీ 'బీఆర్ఎస్' కార్యాలయాన్ని ఈనెల 14వ తేదీన అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయలుదేరారు.

ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్ నుంచే కాదు.. కర్ణాటక, తమిళనాడు, బీహార్, యూపీల నుంచి కూడా పలువురు కీలక నేతలను కేసీఆర్ ఆహ్వానించారు. వారు వచ్చి వెళ్లేందుకు వీలుగా ఈ ప్రత్యేక ఫ్లైట్లు బుక్ చేసినట్టు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ జాతీయ నేతల కోసం ప్రగతిభవన్ నుంచి బుక్ చేశారా? అని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదంతా తెలంగాణ సొమ్ము అని.. కేసీఆర్ వ్యక్తిగత పార్టీ కోసం తెలంగాణ ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారా? అని విమర్శిస్తున్నారు.

ఎంపిక చేసిన జాతీయ నాయకుల కోసం ప్రత్యేక విమానాలు.. వారు బస చేయడానికి ప్రత్యేక వసతి ఇలా అన్నింటిని ఏర్పాటు చేసినట్టు ప్రగతిభవన్ వర్గాలు తెలిపాయి. మరి ఈ ఖర్చు కేసీఆర్ ఖాతాలోనా? తెలంగాణ ప్రజలదా. ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వ పనుల కోసం కాదు. తన సొంత పార్టీ పనుల మీదనే వెళ్లటం తెలిసిందే. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన నేపథ్యంలో.. పార్టీ ఢిల్లీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. సోమవారం సాయంత్రం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన ఆయన వెంట భార్య, మనమడు ఉండటం గమనార్హం. వీరితో పాటు మరికొందరు ఉన్నారు. మరి.. పార్టీ పని మీద ఢిల్లీకి వెళ్లినప్పుడు.. అందునా ప్రత్యేక విమానంలో అయినప్పుడు ఆ ఖర్చు ఎవరి ఖాతా? అన్నది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్న మాట..

కేసీఆర్ తన పార్టీ విస్తరణ కోసం ఖర్చంతా తెలంగాణ ప్రజల సొమ్మునే వాడుతున్నాడా? అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తన పార్టీ అంటే తన సొమ్మును ఖర్చు చేయాలని కానీ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ ఏర్పాట్లు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి ఈ వివాదంపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.