Begin typing your search above and press return to search.
వరాల మూటను విప్పిన కేసీఆర్
By: Tupaki Desk | 17 Jan 2017 9:38 AM GMTఒక్కో సీజన్లో ఒక్కోలా వ్యవహరిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తాను సీఎంగా పదవిని చేపట్టిన కొద్ది నెలల తర్వాత ఆయన రోజుకో వరం చొప్పున బ్యాక్ టు బ్యాక్ వరాల వర్షం కురిపించారు. రోజుకో హామీతో ఆయన చేసిన ప్రకటనలు ఆసక్తికరంగా మారటమేకాదు.. తర్వాతి రోజు కేసీఆర్ నోటి నుంచి ఏ మాట వస్తుందన్న ఉత్కంట నెలకొనేది.
కొద్దికాలంగా వరాల మూటను విప్పదీయని కేసీఆర్.. తాజాగా ఆ లోటును భర్తీ చేసేలా ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. దేశ భద్రత కోసం అవిశ్రాంతంగా పోరాడే సైనికుల విషయంలో ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవని.. వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారన్న విమర్శ ఉంది. దీనికి చెక్ చెప్పేలా కేసీఆర్ తాజా వ్యాఖ్యలు వినిపించే వేళ.. తమ సర్కారు అందుకు భిన్నమన్న సందేశాన్నిఇచ్చేలా కేసీఆర్ ప్రకటన ఉండటం గమనార్హం.
సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పిన కేసీఆర్.. రానున్నరోజుల్లో చేయనున్న కార్యక్రమాల జాబితా వింటే ఫిదా అయిపోవాల్సిందే. సైనికులసంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని.. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని ప్రకటించారు.
మాజీ సైనిక ఉద్యోగుల కుటుంబాలకు పిల్లలకు ప్రభుత్వ గురుకులాల్లో రెండు శాతం రిజర్వేషన్లను కల్పించనున్నట్లుగా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో రెండుశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. సైనికుల నిర్మించుకునే ఇళ్లకు ఆస్తిపన్ను మినహాయిస్తామన్న మాటను చెప్పేశారు.
సైనిక పాఠశాలను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన కేసీఆర్.. పురస్కారాలు పొందిన సైనికులకు భారీ నగదు బహుమానాన్ని ప్రకటించారు. వీరచక్ర.. శౌర్య చక్ర అవార్దులు పొందిన సైనికులకు రూ.75 లక్షలు.. సేవా మెడల్ పొందినవారికి రూ.30క్షలు.. సర్వోత్తమ అవార్డు పొందిన వారికి రూ.25లక్షల నగదు పురస్కారం ఇవ్వనున్నట్లుగా చెప్పారు. ఏదైనా చేస్తే.. భారీతనం ఉట్టిపడేలా ఉండే కేసీఆర్ తీరుకు తగ్గట్లే ఆయన తాజా వరాలు ఉన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/