Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా పరిస్థితి పై..స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ ఏంచెప్పారంటే!

By:  Tupaki Desk   |   30 March 2020 6:33 AM GMT
ఏపీలో కరోనా పరిస్థితి పై..స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ ఏంచెప్పారంటే!
X
కరోనా వైరస్ పై ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలలో భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ కరోనా ప్రభావం ఏపీలో కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. దీనితో ఈ రోజు కరోనా వైరస్‌ నివారణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు - మున్సిపల్‌ కమిషనర్లు - ఆర్డీఓలు - ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తరువాత కరోనాని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏవి - ప్రభుత్వం కరోనా ని అరికట్టడానికి ఎలా సన్నధం అవుతుంది అనే విషయాలని స్పెషల్ ఆఫీసర్ ... హరికృష్ణ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకి వివరించారు.

అయన మాట్లాడుతూ .." కరోనా అనేది ఒక పెద్ద విపత్తు అని - దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి సన్నద్ధం అయ్యింది అని - ఈ కరోనా పై దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విదంగా మన సీఎం జగన్ గారు సునిశితమైన దృష్టితో ముందస్తు చర్యలు - సన్నద్ధతని ఏర్పాటు చేసారు అని తెలిపారు. ఈ కరోనా వైరస్ భారత్ లోకి అప్పుడప్పుడే వ్యాప్తి చెందుతున్న సమయంలోనే అధికారులతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి - ఆ సమావేశంలో ఈ జబ్బు రాష్ట్రంలో విస్తరిస్తే ..తీసుకోవాల్సిన చర్యలపై దాదాపుగా ఒక నెల ముందే సీఎం చర్చించారని - ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా ప్రభుత్వాన్ని సర్వసన్నదంగా ఉండాలని చెప్పారని తెలిపారు.

ఇదే నేపథ్యంలో కరోనా పై దేశంలోనే అందరికంటే ముందే ముందస్తు చర్యలు తీసుకున్న రాష్ట్రం ఒక్క ఏపీనే అని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారికీ కరోనా పై అవగాహనా కలిగించే రాష్ట్రం మన రాష్ట్రం మాత్రమే అని చెప్పారు. అలాగే ఎక్కువ సమీక్షలు - ఎక్కువ పబ్లిసిటీ చేయడం వల్ల ప్రజలలో భయాన్ని పెంచడం తప్పా ..మనం ఏమి చేయలేము అనేది సీఎం భావన అని - అందుకే అధికారులకి - ప్రజాప్రతినిధులకు సీఎం జగన్ ఒకే మాట చెప్పారు ..అందరికి కరోనా పై అవగాహనా కలిగించి - వారు ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించేలా చేయండి అని చెప్పారని తెలిపారు. అలాగే కొత్త వైరస్ కాబట్టి ..ఏదైనా అనుకోని ఆపద ఎదురైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని తెలిపారు. ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి లోపం కానీ - ఎటువంటి శక్తివంచన కానీ ఉండకూడదు అని తెలిపారు.

ప్రస్తుతానికి దేశంలో అతి తక్కువ కరోనా కేసులు నమోదైంది మన ఏపీలోనే ..కాకపోతే ఈ వైరస్ ఎప్పుడు విజృంభిస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ప్రభుత్వం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అని అయన తెలిపారు. అలాగే మీడియా కి - ప్రజలకి సామజిక భాద్యత చాలా అవసరం అని, ఆ బాధ్యతని తెలుసుకొని అందరూ మెదులుతే తప్పకుండ ఈ కరోనా నుండి బయట పడవచ్చు అని తెలిపారు. ముఖ్యంగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారు బయటకి రాకుండా ఉండాలని - నాకు కరోనా లక్షణాలు ఏమి లేవు అని ఇష్టం వచ్చినట్టు బయట తిరిగితే ..వాళ్లకి తెలియకుండానే ఎన్నో వేలమందికి ఆ వ్యాధిని అంటిస్తారు అని ..ఈ నేపథ్యంలో ఒక్కసారి మన కుటుంబం గురించి ఆలోచిస్తే ..అందరూ ఇంట్లోనే ఉంటారు అని తెలిపారు. అలాగే ఈ వ్యాధి సోకిన వారికీ కూడా ఏమి కాదు అని , కరోనా వచ్చిన వారిలో 80 శాతం మంది ప్రాణానికి ప్రమాదం ఏమి లేదు అని ,మిగిలిన 20 శాతంలో కూడా కొంతమందికి మాత్రమే ప్రాణహాని ఉంటుంది అని అందరూ ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించి ..అందరూ పాటించేలా చేయాలనీ తెలిపారు.