Begin typing your search above and press return to search.
వీర్యం క్వాలిటీగా ఉండాలంటే.. ఇలా చేస్తే చాలట!
By: Tupaki Desk | 12 April 2021 9:00 AM GMTస్పెర్మ్ కౌంట్, క్వాలిటీ లోపం అనేది గతంలో అరుదుగా కనిపించే సమస్య. కానీ ఇప్పుడు విరివిగా కనిపిస్తోంది. వీర్య కణాలు అవసరమైనన్ని లేకపోవడం.. ఉన్నా అందులో నాణ్యత లేకపోవడం.. వంటి కారణాలతో సంతానం కలగక ఇబ్బంది పడే జంటలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇదో సాధారణ సమస్యగా మారిపోయింది.
ఈ సమస్యను ఎదుర్కొంటున్న ఎంతో మంది.. సంతానం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వేలాది రూపాయలు విలువ చేసే మందులు మింగుతున్నారు. అయితే.. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా.. ఆరోగ్యంగా స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ పెంచుకునే మార్గాన్ని సూచిస్తున్నారు పరిశోధకులు.
చక్కగా కంటి నిండా నిద్రపోతే చాలని చెబుతున్నారు. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర పోయే వారిలో వీర్య వృద్ధి సమృద్ధిగా ఉంటుందని తేల్చి చెబుతున్నారు. ఇది యథాలాపలంగా చేస్తున్న ప్రకటన కాదని, పరిశోధనలు చేసిన తర్వాత వచ్చిన రిపోర్టు ఆధారంగా చెబుతున్నామని అంటున్నారు.
అయితే.. పడుకోవడమంటే మరీ కుంభకర్ణుని రీతిలో పడుకుంటే కూడా మోసమేనని అంటున్నారు. 6 గంటల కన్నా తక్కువ నిద్రించినా.. 8 గంటల కన్నా ఎక్కువ పడుకున్నా సమస్య వస్తుందని అంటున్నారు. ఇలాంటి వారి వీర్యంలో తేడాలు ఉంటున్నాయని గుర్తించామని చెప్పారు.
అందువల్ల రోజుకు 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలని, అదే విధంగా.. నిద్రకు రెండు గంటల ముందే భోజనాన్ని ముగించాలని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా.. బెడ్ ఎక్కడానికి గంట ముందే మొబైల్ ఫోన్లకు, ల్యాప్ టాప్ లకు గుడ్ నైట్ చెప్పాలని అంటున్నారు. ఇలా చేస్తే.. వీర్య కణాలు జెట్ స్పీడ్ లో అండం వైపు దూసుకెళ్లడం.. సక్సెస్ ఫుల్ గా బ్లాస్ట్ చేయడం ఖాయమని చెబుతున్నారు. ఇందులో నష్టం కలిగించే సూచనలేవీ లేవుకాబట్టి.. తప్పకుండా పాటిస్తే మంచిది.