Begin typing your search above and press return to search.

విమానాశ్రయం నుంచి సచివాలయం దాకా.. విశాఖలో ప్రత్యేక రహదారి

By:  Tupaki Desk   |   15 Jun 2021 3:30 PM GMT
విమానాశ్రయం నుంచి సచివాలయం దాకా.. విశాఖలో ప్రత్యేక రహదారి
X
రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది. వైజాగ్‌ను రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినందున, ప్రభుత్వ పరిపాలన విశాఖపట్నం నుండే నడువనుంది. ఈ మేరకు జగన్ సర్కార్ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది.

రాజధానిని వైజాగ్‌ లో రహదారులు మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పిస్తోంది. నగరంలో రోడ్డు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రాబోయే మూడు నెలల్లో వైజాగ్‌కు రాజధాని మార్చబోతున్నారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) నగరాన్ని రాజధానిగా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

వైజాగ్ విమానాశ్రయం, ప్రతిపాదిత సచివాలయాన్ని కలిపే ప్రత్యేక రహదారిని ప్రస్తుతం యుద్ధప్రతిపాదికన నిర్మిస్తున్నారు. విమానాశ్రయం నుండి నగరంలోకి ప్రవేశించాలనుకునే ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు వంటి వివిఐపిల కోసం ఈ ప్రత్యేక రహదారి నిర్మిస్తున్నారు. కీలకమైన జంక్షన్లలో రహదారిని విస్తరిస్తున్నారు. విస్తరణ పనుల కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది.

వార్తా కథనాల ప్రకారం.. బోయపాలంలోని ఒక విద్యా సంస్థలో సచివాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. విమానాశ్రయం నుంచి బోయపాలెం కలిపే రహదారి ఎన్‌ఎడి, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవక, మధురవాడ మీదుగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ రహదారి సుమారు 35 కి.మీ. సీఎం ప్రయాణంలో ట్రాఫిక్ అడ్డంకులు నివారించడానికి కీలకమైన జంక్షన్లలోని రహదారి పొడిగింపులు చేస్తున్నారు.

రహదారుల విస్తరణలో చట్టపరమైన గొడవలు ఉన్నందున, రహదారి పొడిగింపుకు తమ భూమిని కోల్పోయిన ఇళ్లకు టిడిఆర్ జారీ చేయాలా లేదా నిర్దిష్ట ప్రాంతంలో భూములను కేటాయించాలా అనే దానిపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.. వైజాగ్‌కు రాజధాని మారడానికి ముందు పనులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు.