Begin typing your search above and press return to search.
ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక స్కూల్ ... ఎక్కడంటే ?
By: Tupaki Desk | 29 Jun 2021 11:30 PM GMTదేవుడు సృష్టించిన సృష్టిలో ఆడ, మగ కాకుండా. అటు ఆడవారిగా కాకుండా ఇటు మగవారిగా కాకుండా మధ్యరకంగా జన్మించిన వారిని ట్రాన్స్ జెండర్ అంటారు. శరీరంలో డిఎన్ఎ లోపం వల్ల వారు ఆ విధంగా మారుతారని పరిశోధకులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రాన్స్ జెండర్ లు అర్ధనారీశ్వరుని కి ప్రతిరూపం. ట్రాన్స్ జెండర్స్ కి ఈ సమాజంలో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రాన్స్ జెండర్స్ అంటే గౌరవం ఉన్నప్పటికీ, కొందరు చేసే చిల్లర పనుల వల్ల మొత్తం ట్రాన్స్ జెండర్స్ అందరూ కూడా ఇలాగే ఉంటారు అని, ఇలాంటి పనులే చేస్తారని వారిపై ఓ ముద్ర పడిపోయింది. అయితే, ట్రాన్స్ జెండర్స్ కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. కొన్ని చోట్ల వారికి ఉన్న అభిమానం చూస్తే ముచ్చటేస్తుంది. రోజులు మారుతున్నా, సైన్స్ పరంగా ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కూడా ట్రాన్స్ జెండర్స్ పై ఇంకా పలు చోట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది.
ట్రాన్స్ జెండర్స్ సమాజంలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. వారు ఎక్కడికైనా వెళ్లి చదువుకోవాలి అంటే అనేక రకాల ఇబ్బందులు. సాధారణ పిల్లలు చదువుకునే స్కూల్స్ లో ట్రాన్స్ జెండర్స్ చదువుకోవడానికి అవకాశం కల్పించడం లేదు. వారిని ఏ స్కూల్లో జాయిన్ చేసుకోరు, ఒకవేళ స్కూల్లో జాయిన్ అయినా నా తోటి విద్యార్థులు హేళన చేస్తూ వారి మనోధైర్యాన్ని దెబ్బతీసింది ఉంటారు. ఇలా వారు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉంటాయి.
దీనితో, మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో ట్రాన్స్ జెండర్స్ కి ఉచిత విద్యను అందించేందుకు పాఠశాలను ఏర్పాటు చేశారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఓ ఎన్ జిఓ ముందుకు వచ్చి ట్రాన్స్ జెండర్స్కో సం పాఠశాలను నిర్మించింది. ఇక ఇప్పటి వరకు ఈ పాఠశాలలో పెద్దలు, పిల్లలు కలిసి 25 మంది జాయిన్ అయినట్లు తెలిపారు. ఇక ఈ విషయంపై ట్రాన్స్ జండర్స్ మీడియాతో మాట్లాడారు. తమకు చదువుకోవాలని ఉన్నా పాఠశాలకు వెళ్లలేకపోతున్నామని, తమకు పాటలు చెప్పేందుకు ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు. తమ బాధలని ఓ NGOకి తెలిపామని వారు తమకోసం పాఠశాల ఏర్పాటు చేశారని వివరించారు. ఈ పాఠశాలలో వయసుతో సంబంధం లేకుండా ట్రాన్స్ జెండర్స్ ఎవరైనా వచ్చి చదువుకోవచ్చని చెప్పారు.ఎన్ జిఓ వ్యవస్థాపకులు, చైర్ పర్సన్ రేఖా త్రిపాఠి మాట్లాడుతూ లింగభేదం లేకుండా అందరికి విద్యను అందించాలని తెలిపారు. ఆలా అందించినప్పుడే సమాజంలో అందరికి గౌరవం దక్కుతుందని తెలిపారు. చాలా చోట్ల ట్రాన్స్ జెండర్స్ ని పాఠశాలలోకి రానివ్వడం లేదని వారిని చిన్న చూపుచూస్తున్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వాలు ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారని వాటిల్లో జాయిన్ కావడానికి అందరూ ముందుకురావాలని కోరారు.