Begin typing your search above and press return to search.
స్పెషల్ స్టేటస్’ ‘3 క్యాపిటల్స్ ’ ఇవి సర్కారు పాలసీలు కాదు.. విస్కీ బ్రాండ్లు..!
By: Tupaki Desk | 2 Feb 2021 11:30 PM GMTఇటీవల ఏపీ ప్రభుత్వ వ్యతిరేక సోషల్ మీడియా ‘స్పెషల్ స్టేటస్’ ‘3 క్యాపిటల్స్’ అంటూ రెండు విస్కీ బ్రాండ్లను తెరమీదకు తీసుకొచ్చాయి. వీటిని సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ.. ఏపీ జగన్ మోహన్‌రెడ్డి తాను చెప్పినట్టుగానే ‘స్పెషల్ స్టేటస్’ తీసుకొచ్చాడు అంటూ కొందరు ఈ బ్రాండ్లకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. అయితే ఈ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా? లేక మార్ఫింగ్ చేశారా ? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
ఆ పనిచేయాల్సింది ప్రభుత్వ అనుకూల సోషల్ మీడియా .. కానీ ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ అయితే లేదు.
అయితే లాక్డౌన్ నిబంధనలు సడలించకా.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా లిక్కర్ షాపులు ఓపెన్ చేశారు. ఆ టైంలో ‘ప్రెసిడెంట్ మెడల్’ అనే బ్రాండ్ తెరమీదకు వచ్చింది. అప్పట్లోనూ జగన్ సర్కారుపై జోకులు పేలాయి. సీఎం పాలనకు మెచ్చి రాష్ట్రపతి ఇచ్చిన బహుమానం ఇదేనంటూ అప్పట్లో మీమ్స్ ట్రెండ్ అయ్యాయి.
నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ఇక్కడ పాపులర్ బ్రాండ్స్ ఏవీ దొరకడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మందుబాబులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ మద్యం తెచ్చుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకొచ్చిన బ్రాండ్ల పై కూడా జోకులు పేలుతున్నాయి.