Begin typing your search above and press return to search.

హోదా ముగిసిన అధ్యాయ‌మే.. ఇవిగో నిజాలు!

By:  Tupaki Desk   |   9 Feb 2022 2:30 AM GMT
హోదా ముగిసిన అధ్యాయ‌మే.. ఇవిగో నిజాలు!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తుందా? రాదా? ఇదీ.. గ‌డిచిన కొన్నేళ్లుగా ఏపీ ప్ర‌జ‌ల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌. అయి తే.. దీని చుట్టే.. రాజ‌కీయాలు కూడా తిరుగుతున్నాయి. 2014నుంచి నేటి వ‌ర‌కు హోదా చుట్టూ అనేక రాజ‌కీయాలు తారాట ఆడుతున్నాయి. 2014లో బీజేపీ+టీడీపీ+ జ‌న‌సేన‌లు ఉమ్మ‌డిగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేశాయి. ఈ స‌మ‌యంలో ఏకంగా.. మోడీ పాల్గొన్న స‌భ‌ల్లోనే.. తాము అధికారంలోకి వ‌స్తే.. హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ప్ర‌జలు.. చంద్ర‌బాబు, బీజేపీతో కూడిన ఉమ్మ‌డి ప్ర‌భుత్వానికి జై కొట్టారు.

అయితే.. గ‌ద్దె నెక్క‌క ముందు చెప్పిన మాట‌.. త‌ర్వాత‌.. మోడీ యూట‌ర్న్ తీసుకుని విస్మ‌రించారు. ఈ క్ర‌మంలో త‌మ పాల‌క భాగ‌స్వామిగా ఉన్న చంద్ర‌బాబును ఒప్పించి.. ప్యాకేజీ సిద్ధం చేశారు. ఈ విష‌యం లో అంతో ఇంతో అంత‌ర్మ‌థ‌నం చెందిన చంద్ర‌బాబు.. తాను పెట్టిన ప్ర‌పోజ‌ల్స్‌కు కేంద్రం ఓకే చెప్ప‌డం తో.. వారు పెట్టిన ప్యాకేజీ ప్రపోజ‌ల్‌కు ఈయ‌న సై అన్నారు. ఈ క్ర‌మంలో అప్ప‌టి వ‌ర‌కు హోదా విష‌యాన్ని భుజాన వేసుకోని.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌..చంద్ర‌బాబు వ‌దిలేసిన హోదాను జేబుకు త‌గిలించుకున్నారు.

తాను అధికారంలోకి వ‌స్తే.. కేంద్రం మెడ‌లు వంచుతాన‌ని.. 25 మంది ఎంపీల‌ను ఇవ్వండ‌ని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. దీంతో జ‌నాలు.. ఆయ‌న‌కు 22 మంది ఎంపీల‌ను ఇచ్చారు. తీరా చూస్తే.. మ‌నోడు.. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి.. కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నున్న బీజేపీకి భారీ మెజారిటీ వ‌చ్చింద‌ని, ఇప్పుడు మ‌నం ఏమీ చేయ‌లేమ‌ని... ప్లీజ్ ..ప్లీజ్‌..అని అన‌డం త‌ప్ప‌! అని చేతులు ఇండియా గేటంత పైకి ఎత్తేశారు. క‌ట్ చేస్తే.. మ‌రోసారి ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. దీనికి మ‌రో రెండేళ్ల స‌మ‌య‌మే వుంది. దీంతో ఇప్పుడు హోదా విష‌యం.. వైసీపీకి చుట్టుముడుతోంది.

ఇప్పుడు మ‌రోసారి.. తెలుగు ప్ర‌జ‌ల‌కు సెంటిమెంటుగామారిన హోదా అంశం.. ఎవ‌రైనా..ఎన్నిక‌ల అస్త్రం గా తీసుకుంటే.. తాము అడ్డంగా దొరికిపోతామ‌ని.. వైసీపీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న మాట వాస్త‌వం. అందుకే.. ఎవ‌రికీ ఛాన్స్ ఇవ్వ‌న‌ట్టుగా.. తాము.. ఆది నుంచి ఈవిష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నామంటూ.. వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ్య‌స‌భ‌లో సుమారు 20 నిమిషాలు మాట్లాడిన ఆయ‌న‌.. హోదా విష‌యంలో తాము ఏం చేస్తోందీ.. సీఎం జ‌గ‌న్ ఎంత క‌ష్ట‌ప‌డుతున్న‌దీ.. వారాలు.. వ‌ర్జ్యాలు.. నెల‌లు, తారీకుల ఆధారంగా.. అన్నివివ‌రాల‌ను వెల్ల‌డించారు.

అంటే.. త‌మ త‌ప్పులేద‌ని.. తాము అడుగుతూనే ఉన్నామ‌ని.. కేంద్రం వినిపించుకోవ‌డం లేద‌ని.. సో.. వ‌స్తే.. అది మా ఘ‌న‌త‌.. లేకుంటే.. కేంద్రం పాపం.. అన్న‌ట్టుగా సాయిరెడ్డి తేల్చేశారు.కానీ, ఇంత జ‌రిగినా.. కేంద్రం నుంచి ఒక్క‌రంటే ఒక్క‌రు ఒక్క‌మాటంటే ఒక్క మాట కూడా అన‌లేక‌పోవ‌డం.. కేంద్రం నుంచి ఎలాంటి స‌మాధానం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కేంద్రం వివిధ కార‌ణాలు చూపుతూ.. హోదా ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పేసింది. సో.. ఇక‌, ఇప్పుడు వైసీపీ సాధించేది ఏమీలేదు.

అంటే.. ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌లు ఇప్ప‌ట్లో తీర‌వు. పోనీ.. త‌ర్వాతైనా.. ఏపీలోన‌ను, కేంద్రంలోను ప్ర‌భుత్వాలు మారితే.. హోదా వ‌చ్చేవ అవ‌కాశం ఉందా? అంటే.. ఏకంగా.. అప్ప‌టికి విభ‌జ‌న చ‌ట్టానికి ప‌దేళ్లు పూర్త‌వుతాయి కాబ‌ట్టి.. ఇక‌, ఈ అంశం పూర్తిగా మ‌రుగున ప‌డిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అంటే.. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. హోదా ఇక‌, ముగిసిన అధ్యాయ‌మే.. అంటున్నారు ప‌రిశీల‌కులు.