Begin typing your search above and press return to search.
ప్రత్యేక హోదా గ్యారెంటీనట
By: Tupaki Desk | 19 Oct 2022 1:55 AM GMTకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా గ్యారెంటీగా ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ ఏపీలోకి అడుగుపెట్టారు. మొన్ననే పాదయాత్రలో ఏపీలోకి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించినా మళ్ళీ కర్నాటకలోని బళ్ళారిలోకి వెళ్ళారు. అంటే కొన్ని గ్రామాలు కర్నాటకలోకి అలాగే ఏపీలోకి విస్తరించున్నాయి. ముందుగా నిర్ణయించిన రూటు మ్యాపు ప్రకారం రాహుల్ కర్ణాటక, ఏపీల్లోని గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇవ్వటం గ్యారెంటీ అన్నారు. విభజన హామీల అమలులో భాగంగా ఏపీకి హోదా ఇచ్చే విషయానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అమరావతి కాన్సెప్టును దెబ్బతీయటానికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ఇంకా ఏపీ అభివృద్దికి రాహుల్ చాలానే చెప్పారు కానీ అసలీ దరిద్రమంతా వచ్చింది తనవల్లే అని రాహుల్ మరచిపోయారు.
పచ్చగా కళకళలాడుతున్న సమైక్య రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డుగోలుగా విభజించిన కారణంగానే ఇపుడు ఏపీ పరిస్ధితి ఇంత దయనీయంగా తయారైంది. శాస్త్రీయపద్దతిలో కాకుండా తెలంగాణాకు అనుగుణంగా ఇంకా చెప్పాలంటే కేసీయార్ చెప్పినట్లుగా రాహుల్, సోనియాగాంధి విని అడ్డుగోలుగా విభజించేశారు. అందుకనే హైదరాబాద్ తో కూడిన రాజధానితో పాటు ఆస్తులన్నింటినీ తెలంగాణాకు దక్కింది. ఇదే సమయంలో లోటు బడ్జెట్, అప్పులతో పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ అవతరించింది.
విభజనలో చేసిందంతా చేసిన రాహుల్ ఇపుడు మళ్ళీ ముసలి ఏడుపులాగ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది. అసలు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది ఎప్పుడు ? కనుచూపుమేరలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలుగుతుందా ? నరేంద్రమోడీపై జనాల్లో బాగా వ్యతిరకత పెరిగిపోయి వేరేదారి లేక జనాలు కాంగ్రెస్ కు ఓట్లస్తే కొన్ని సీట్లు పెరిగితే పెరగచ్చు. అంతేకానీ ఇప్పటికిప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు ఏపీకి ప్రత్యేకహోదా వచ్చేదీ లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.