Begin typing your search above and press return to search.
ప్రత్యేక హోదా.. విశాఖ ఉక్కుపై పోరాడే టైం వచ్చేసినట్లేనా?
By: Tupaki Desk | 19 Nov 2021 12:30 PM GMTమంది బలం ఉంటే చాలు.. తాము అనుకున్నదే చట్టమన్నట్లు వ్యవహరించే పాలకులకు కొదవ లేదు. ఇలాంటి తీరులో కేంద్రంలోని మోడీ సర్కారు తర్వాతే ఏదైనా. సాధారణంగా కీలక నిర్ణయాలు తీసుకునే వేళ.. అన్ని కాకున్నా కొన్నింటి విషయాల్లో అయినా కాస్తంత వెనక్కి తగ్గేందుకు సముఖత వ్యక్తం చేయటం.. విపక్షాలు లేవనెత్తే అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోవటం లాంటివి చేస్తుంటారు. కానీ.. గడిచిన ఏడున్నరేళ్ల కాలంలో మోడీ సర్కారు మాత్రం అలాంటి తీరును ప్రదర్శించిన దాఖలాలు అస్సలు కనిపించవు.
ఇటీవల వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలు.. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తుందన్న అంచనాలు మోడీ సర్కారు తన మార్క్ అయిన మొండితనానికి కాసింత విశ్రాంతి ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెప్పాలి. ఈ వాదానికి బలం చేకూరేలా తాజాగా ప్రధాని మోడీ మూడు వివాదాస్పద రైతు చట్టాల్ని రద్దు చేస్తామని..అందుకు తగ్గట్లు సాంకేతిక చర్యల్ని చేపడతామని చెప్పటం తెలిసిందే. దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే సమయంలో ఆయన నోటి నుంచి వచ్చిన ఈ మాట ఇప్పుడు కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. ఇంతకాలం మోడీ తీరుతో విసిగిపోయిన ఉద్యమకారులకు కొత్త బలాన్ని.. అంతకు మించిన స్థైర్యాన్ని ఇస్తుందని చెప్పాలి.
మొండిగా ముందడుగు మాత్రమే తప్పించి.. వెనకడుగు వేసేదే లేదన్నట్లుగా వ్యవహరించే మోడీ సర్కారులో వచ్చిన మార్పు నేపథ్యంలో ఆంధ్ర ప్రజలు తమ హక్కుల సాధనకు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. విభజన వేళ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై ఎంత అడిగినా ఫలితం లేదన్నట్లుగా వ్యవహరించిన మోడీ సర్కారు.. మారిన పరిస్థితుల్లో గతంలో మాదిరి కఠినంగా చెప్పే వీల్లేని పరిస్థితి. అంతేకాదు.. లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు విషయంలోనూ కేంద్రం తీరును వేలెత్తి చూపిస్తూ ఉద్యమాన్ని నిర్వహిస్తే ఫలితం ఉండే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బలంగా ఉన్న వేళ ఎంత చెప్పినా వినని వారు.. కాస్త బలహీనులు అయ్యాక పాత డిమాండ్లే అయినా.. ప్రభావవంతంగా పోరాడగలిగితే కొంతమేర మార్పు వచ్చే వీలుంది. ప్రత్యేక హోదా అంశంపై ఏపీ ప్రజలు స్పందించే తీరును అనుసరించి కేంద్రం తుది నిర్ణయం తీసుకునే వీలుంది. మరి.. ఏపీ ప్రజలు ఇప్పుడు ఎలా రియాక్టు అవుతారన్నదే అసలు ప్రశ్న. ఇప్పుడు బంతి వారి కోర్టులో ఉంది. మరేం చేస్తారన్నది వారి చేతుల్లోనే ఉంది.