Begin typing your search above and press return to search.
బీజేపీలో ‘బండి’ పని అయిపోయిందా?
By: Tupaki Desk | 22 March 2021 5:30 AM GMTతెలంగాణ రాష్ట్రంలో ఇక బీజేపీ పని అయిపోయిందా..? రెండు ఎన్నికల్లో గెలిచిన మాత్రానా బీజేపీకి రాష్ట్రమంతా ఉన్న ప్రజలు ఆదరించడం లేదా..? బీజేపీని ఒక రేంజ్ లో తీసుకొచ్చిన ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు పార్టీ ఓటమికి కారణమవుతున్నారా..? బండి సంజయ్ కామెంట్లతోనే ప్రజలు కమలంను ఓడగొడుతున్నారా..? ప్రస్తుతం తెలంగాణలో వాడీ వేడిగా జరగుతున్న చర్చ ఇది. గత ఆర్నేళ్లుగా తెలంగాణలో రాజకీయం మారుతోందని అనుకున్నారు.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలుస్తుందనుకున్నారు.. కానీ కేవలం రెండు ఎన్నికల వరకే బీజేపీ అని.. ఆ తరువాత చతికిలబడినట్లేనన్న చర్చ సీరియస్ గా జరుగుతోంది.
కార్పొరేటర్ గా ఉన్న బండి సంజయ్ ఎంతో కాలంగా శ్రమించి 2019 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా ఓడిపోతున్నారన్న సానుభూతి వల్లే గెలిచారు. ఆయన ఫాలోయింగ్ ను గమనించిన కేంద్ర పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. ఆ తరువాత అదే జోష్ లో దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు బండి సంజయ్ కృషి చేశాడు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని ప్రచారం చేయడంతో హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ నాయకులు అనుకున్నవాటికంటే ఎక్కువ సీట్లు గెలువగలిగారు. అటు టీఆర్ఎస్ పార్టీ సైతం ఒక దశలో నిరాశ చెందింది.
ఈ తరుణంలో ఇటీవల వరంగల్, హైదరాబాద్ పరిధుల్లో జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. హైదరాబాద్ లో సిట్టింగ్ సీటును కోల్పోగా.. వరంగల్ లో నాలుగో స్థానంలోకి పడిపోయింది. దీంతో ఇక బీజేపీ పని అయిపోయిందా..? అన్న చర్చసాగుతోంది. అయితే బండిసంజయ్ ఈ ఎన్నికలపై ప్రెస్ మీట్ పెట్టి పట్టభద్రులను, ఉపాధ్యాయులను బెదిరించి ఓట్లు వేసుకున్నారని కామెంట్ చేశారు. అయితే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ బెదిరించే ఓట్లు వేసుకున్నారా..? అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమే కానీ..పరిస్థితులను బట్టి ఇది మారుతూ ఉంటుంది. అందువల్ల మారుతున్న దానికి అనుగుణంగా పార్టీలు కూడా తన తీరు మార్చుకోవాలని కొందరు సూచిస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ దుబ్బాక ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఒకటి, రెండు ఎన్నికల్లో గెలవొచ్చుగానీ.. ప్రతీసారి విజయం సాధించలేరని అంటున్నారు.
త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ కు అభ్యర్థి ఉండగా.. టీఆర్ఎస్ చివరి నిమిషంలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే బీజేపీకి మాత్రం క్యాండెట్ దొరకడం లేదని వాదన ఉంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవల్లో పార్టీని తీసుకెళ్లడం ద్వారా పట్టు సాధించవచ్చని కొందరు పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ఈ ఎన్నికలోనూ కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు మానుకొని ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధి విషయంలో ప్రచారం చేయాలని అంటున్నారు. ఈ ఎన్నికల్లో కనుక బీజేపీ ఓడిపోతే రాష్ట్రంలో మళ్లీ కమలం కోలుకునే పరిస్థితి ఉండదని అంటున్నారు.