Begin typing your search above and press return to search.

ఉండేది గల్లిలో..ఇండియన్ క్రికెటర్లతో స్నేహం..

By:  Tupaki Desk   |   14 March 2020 11:30 PM GMT
ఉండేది గల్లిలో..ఇండియన్ క్రికెటర్లతో స్నేహం..
X
అతను చేసేది ఓ చిన్న పని.. కానీ అతడి పరిచయాలు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి.. గల్లిలో చేసే చిన్న పనితో గుర్తింపు తెచ్చుకున్న అతడు.. ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెటర్లతో స్నేహం చేసే స్థాయికి ఎదిగాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ - మాజీ ఇండియన్ క్రికెటర్ ధోని - రైనా - డీవిలియర్స్ - డేవిడ్ వార్నర్ - గేల్ వంటి బడా క్రికెటర్ల పక్కనే కూర్చోని మ్యాచులను చూసే అవకాశం అతడి సొంతమైంది. ఇంతకీ అతనేవరనేది కదా మీ డౌట్..

చెన్నైకు చెందిన భాస్కరన్ గడిచిన 27ఏళ్లుగా క్రికెటర్లకు కోబ్లార్‌ గా పనిచేస్తున్నాడు. షూ మొదలు - గ్లౌజ్‌ లు - పాడ్స్ - హెల్మెట్ ఇలా క్రికెటర్లకు సంబంధించిన వస్తువులకు రిపేర్లు చేస్తుంటాడు. సచిన్ - ధోని - డీవిలియర్స్.. వీరందరి షూ సైజ్‌ లను గుక్కతిప్పుకోకుండా ఇట్టే చెప్పేస్తారు. ఒక్క బ్యాట్ రిపేరింగ్ తప్ప అన్ని పనులు చేస్తాడు. ధోని - సచిన్ - వీవీఎస్ లక్ష్మణ్ తనతో సన్నహితంగా ఉంటారని చెబుతుంటాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తాను ఎక్కడున్న గుర్తిస్తారని.. చూసిన వెంటనే తన దగ్గరకు రమ్మని పిలుస్తారని భాస్కర్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. సచిన్ కు సంబంధించిన వస్తువులకు చాలాసార్లు రిపేర్లు చేశానని భాస్కర్ చెబుతుంటాడు.

విదేశాలకు చెందిన గిల్‌ క్రిస్ట్ - క్రిస్ గేల్ - షేన్ వార్న్ - డేవిడ్ వార్నర్ అందరూ తనను బాగా పలకరిస్తారని ఆనందం వ్యక్తం చేస్తుంటాడు భాస్కర్. తానెప్పుడు డబ్బు గురించి ఆలోచించలేదని-కేవలం ఈ వృత్తి నుంచి తృప్తిని మాత్రమే పొందుతానని తెలిపాడు. తన కుటుంబంలో ఎవరూ ఈ వృత్తిలోకి రాలేదన్నారు. 27ఏళ్లుగా క్లోబార్ గా పనిచేస్తున్నా ఏ క్రికెటర్ తనకు సొంత షాప్ పెట్టుకునేందుకు సహాయం చేయలేదని అదొక్కటే తనకు బాధగా ఉందని వాపోయాడు.

వృత్తిపట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఈ భాస్కర్ ను ఏ క్రికెటర్ ఆదుకుంటాడో చూడాలి. వేలకోట్ల ఆదాయాన్ని ఆర్జించే బీసీసీఐ అయిన తనకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. వీరిలో ఎవరూ స్పందించిన భాస్కర్ జీవితంలో వెలుగులు రావడం ఖాయం. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూడాలి మరీ..