Begin typing your search above and press return to search.
గాంధీలో మనోజ్ పేరిట జర్నలిస్టులకి ప్రత్యేక వార్డు!
By: Tupaki Desk | 11 Jun 2020 9:30 AM GMTఒకవైపు వైరస్ విజృంభిస్తున్న సమయంలో మిగిలిన వ్యవస్థలతో పాటు జర్నలిస్ట్ లు కూడా వార్తలు అందించి జాగ్రత్తలు సూచించేందుకు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే విధి నిర్వహణలో భాగంగా వైరస్ బారిన పడిన జర్నలిస్టులకు ఇకపై ప్రత్యేక వార్డులో చికిత్సలు అందించనున్నట్లు గాంధీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ మనోజ్ పేరుతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
వైద్యులు, పోలీసులతో పాటు వార్తా సేకరణలో భాగంగా జర్నలిస్టులు కంటైన్మెంట్ జోన్లలో పర్యటించి, వైరస్ భారిన పడుతున్నారని, వారికి ప్రత్యేక వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే డాక్టర్లు, పోలీసులతో పాటు జర్నలిస్టులకు ప్రత్యేక వార్డులను కేటాయించింది. ఇప్పటికే 16 మంది జర్నలిస్ట్‌లకు వైరస్ సోకగా, మనోజ్ చనిపోయారు. దీంతో మీడియా ప్రతినిధుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం డాక్టర్లు, పోలీసులతో సమానంగా జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. ఇకపోతే , సచివాలయ బీట్ ను చూసే జర్నలిస్టులకు ఇప్పటికే టెస్టులను ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన వారికి ఈ ప్రత్యేక వార్డులో వైద్యసేవలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.