Begin typing your search above and press return to search.
ఏటా దాదాపు 9 కోట్ల మంది చూసే ఈ టవర్ విశేషాలేంటో తెలుసా?
By: Tupaki Desk | 15 Nov 2021 7:31 AM GMTకరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపింది. ప్రత్యేకంగా టూరిజం అండ్ హాస్పిటాలిటీ రంగం చెప్పలేనంత ఇబ్బందులను ఎదుర్కొంది. వైరస్ వ్యాప్తి కారణంగా చాలా దేశాలు టూరిజం ఆపరేషన్స్ ని పూర్తిగా మూసి వేసాయి. వైరస్ వ్యాప్తి చెందిన నాటి నుంచి ఇప్పటి వరకూ చాలా దేశాలు ఇతర దేశస్తులను అనుమతించాలంటే సంకోచిస్తున్నారు.
ఇంతలా వైరస్ ప్రభావం చూపింది. అయితే పర్యాటక పరంగా బాగా దెబ్బ తిన్నా దేశాల్లో యూరప్ కు చెందిన ఫాన్స్ ఒకటి. ఈ దేశంలో ఉండే వాతావరణ పరిస్థితులు , చూడదగ్గ ప్రదేశాల కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాల వారు ఇక్కడికి వచ్చేందుకు మొగ్గు చూపుతారు. మంచిగా డబ్బు ఉన్న వారు ఒక మంచి హాలిడే ట్రిప్ కోసం ఎక్కడికి వెళ్లాలి అంటే కచ్చితంగా వినిపించే సమాధానం ఫ్రాన్స్. ప్రపంచ పర్యాటకానికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ఫ్రాన్స్ లో వైరస్ సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు.
ఎక్కువ మంది మహమ్మారి బారని పడి మరణించారు. దీంతో ఈ దేశం టూరిజం ఆపరేషన్స్ ను పూర్తి గా మూసివేసింది. మరలా ఆ సేవలను ఇప్పుడిప్పుడే పునరుద్ధరస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యటకుల సంఖ్య ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతుంది. ఫ్రాన్స్ లో ఉండే ఈఫిల్ టవర్ ను చూసేందుకు ప్రతి ఏటా కనీసం 8.9 కోట్ల మంది ఈ నగరానికి వస్తుంటారు. అంతే కాకుండా ప్రపంచంలోనే అతి చిన్నదైన మరో దేశం వాటికన్ సిటీ. దీనిని సందర్శించేందుకు వివిధ దేశాల వారు క్యూ కడుతుంటారు.
యూరప్ లో వైరస్ ఉధృతి తగ్గి... టీకాలు అందుబాటులోకి వచ్చిన కారణంగా.. పర్యాటక రంగం తిరిగి పుంజుకుంటోంది. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు పర్యాటకులను పరిమిత ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా యూరప్ లోని దేశాలు ప్రపంచ పర్యాటకులను తమ వైపు ఆకర్షించేందుకు వారి సేవలను తిరిగి ప్రారంభిస్తున్నారు.
ఈ జాబితాలో ముందున్నది మాత్రం వాటికన్ సిటీ నే. సంవత్సర కాలంలో వాటికన్ సిటీ ని సందర్శించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. క్రైస్తవ మతానికి సంబంధించి కేంద్ర బిందువుగా ఉండే ఈ వాటికన్ సిటీలో మత గురువు పోప్ నివసిస్తుంటారు. దీంతో ఈ నగరాన్ని చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ఈ కారణంగానే ప్రతి ఏటా 55 లక్షల మంది ఈ నగరానికి వస్తుంటారు.
ఇదిలా ఉంటే ప్యారిస్ లో ఉండే ఈఫిల్ టవర్ మరో అద్భుతం. ఈ టవర్ ని చూసేందుకు కూడా పర్యాటకులు క్యూ కడుతుంటారు. సాధారణంగా ఇక్కడికి వచ్చే వారి సంఖ్య ఫ్రాన్స్ లో ఉండే జనాభా సంఖ్య కంటే ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నివసించే వారి సంఖ్య కంటే పర్యాటకులను భారీ సంఖ్యలో ఆకర్షించే ఏకైక నగరం ఫ్రాన్స్ కావడం విశేషం. ఈ దేశానికి వచ్చే రెవెన్యూ లో పర్యాటక రంగానిది కీలక పాత్ర అని అక్కడి అధికారులు చెప్తున్నారు.