Begin typing your search above and press return to search.

వెంక‌య్య రాజీనామా.. అత్యంత చెత్త గాసిప్‌

By:  Tupaki Desk   |   9 March 2018 4:40 PM IST
వెంక‌య్య రాజీనామా.. అత్యంత చెత్త గాసిప్‌
X
అదిగో తోక అంటే.. ఇదిగో పులి అనుకోవ‌టం మామూలే. సోష‌ల్ మీడియాలో ఇలాంటి తీరు ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. అస‌లు తోక కూడా లేకుండానే పులి వ‌చ్చేసింద‌న్న‌ట్లుగా సాగుతున్న కొన్ని ప్ర‌చారాలు చూస్తే.. న‌వ్వాలో.. ఏడ‌వాలో అర్థంకాని ప‌రిస్థితి. ఏపీలో రాజుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌విలో ఉన్న వెంక‌య్య‌నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో కొత్త త‌ర‌హా ప్ర‌చారం సాగుతోంది.

నిజానికి ఇంత‌కంటే అర్థం లేని.. చెత్త గాసిప్ మ‌రొక‌టి ఉండ‌దేమో. మిగిలిన పార్టీల‌కు బీజేపీకి ఒక పెద్ద వ్య‌త్యాసం ఉంది. అదేమంటే.. బీజేపీ నేత‌లు చాలావ‌ర‌కూ క‌మ్యునిస్టుల త‌ర‌హాకు చెందిన వారు. వామ‌ప‌క్ష నేత‌లు ఎంత త‌మ పార్టీ సిద్ధాంతాల ప‌ట్ల ఎంత క‌ర‌కుగా.. ఎంత మొండ‌గా ఉంటారో.. అందుకు డ‌బుల్ మొండిగా ఉంటారు ఒరిజిన‌ల్ బీజేపీ నేత‌లు.

అవ‌స‌రం కోసం బీజేపీలో చేరిన నేత‌ల్ని మిన‌హాయిస్తే.. వెంక‌య్య‌లాంటి హార్డ్ కోర్ క‌మ‌ల‌నాథుడు (ఉప రాష్ట్రప‌తిగా ఉన్న వెంక‌య్య‌ను ఇప్పుడు క‌మ‌ల‌నాథుడ‌ని అన‌కూడ‌దు. ఆయ‌న్ను ఒక బీజేపీ నేత‌గా చూసిన‌ప్పుడు అన్న కోణంలోనే ఈ వ్యాఖ్య చేస్తున్నామ‌ని గుర్తించ‌గ‌ల‌రు) ఎట్టి ప‌రిస్థితుల్లోనే పార్టీ కోస‌మే ప‌ని చేస్తారే త‌ప్పించి ప్ర‌జ‌ల కోసం ఎంత‌మాత్రం కాద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. కావాలంటే ప్ర‌జ‌ల్ని పార్టీకి అనుగుణంగా మారుస్తారే కానీ.. ఆయ‌న ప్ర‌జ‌ల కోసం మారేది ఏమీ ఉండ‌దంటే ఉండ‌ర‌ని మ‌ర్చిపోకూడ‌దు.

నిజానికి వెంక‌య్యకు ప్ర‌జ‌ల కంటే కూడా పార్టీనే ఎక్కువ ఇచ్చింద‌ని చెప్పాలి. మొద‌ట్లోప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఆయ‌న‌కు ఉన్నా.. త‌ర్వాతి కాలంలో పార్టీలో ఆయ‌న చేసిన కృషికి.. క‌ష్టానికి ఫ‌లితం ల‌భించింది. అలాంటి వ్య‌క్తి ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌న్న‌ది చెత్త గాసిప్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక‌వేళ‌.. హోదా మీద అసంతృప్తి ఉంటే.. మోడీ స‌ర్కారు మాట త‌ప్పిన‌ప్పుడే ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేసేవారు. పార్టీ లైన్ మారిన వెంట‌నే.. అందుకు త‌గ్గ‌ట్లుగా త‌న మాట‌ను.. త‌న వాద‌న‌ను మార్చేసుకున్నవెంక‌య్య‌ను అస‌లుసిస‌లు బీజేపీ నేత‌గా చూడాలే త‌ప్పించి ఆంధ్రోడిగా అస్స‌లు ఫీల్ కాకూడ‌దు. ఆయ‌న మొద‌ట బీజేపీకి చెందిన వాడు. ఆ త‌ర్వాతే ఆంధ్రోడైనా.. ఇంకేమైనా?