Begin typing your search above and press return to search.

స్పీడందుకున్న భూమి.. పరిభ్రమణ వేగం ఎందుకు పెరిగింది? ఏమన్నా అనర్థమా?

By:  Tupaki Desk   |   29 July 2022 2:30 PM GMT
స్పీడందుకున్న భూమి.. పరిభ్రమణ వేగం ఎందుకు పెరిగింది? ఏమన్నా అనర్థమా?
X
రోజుకు ఎన్ని గంటలు అంటే ఠక్కున 24 గంటలు అంటారు. కానీ ఇప్పుడు ఈ సమాధానాన్ని మార్చుకోవాలేమో.. ఎందుకంటే భూమి భ్రమణ వేగం పెంచుకుంటోంది. సూర్యుడి చుట్టూ కక్ష్యలోకి తీసుకునే సమయంలో దాని అక్షం మీద 365 సార్లు తిరుగుతుంది. అయితే భూమి అక్షం మీద ఇప్పుడున్న దానికంటే చాలా వేగంగా తిరుగుతోంది.

భూమి వందల మిలియన్ల సంవత్సరాల కిందట సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో 420 భ్రమణాలను పూర్తి చేసింది. ఇది 444 మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ తర్వాత కొన్ని మిలియన్ సంవత్సరాలకు ఇది 410కి తగ్గిందని తేల్చారు.

భూమి పరిభ్రమణ వేగం పెరిగింది. మనుషులు విమానాల్లో రాకెట్లలో ప్రయాణిస్తూ వేగాన్ని అందుకుంటే తనేమీ తక్కువ తిన్నాన అన్నట్టుగా భూమి కూడా స్పీడ్ పెంచింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 24 గంటల్లో ఒక రోజునుపూర్తి చేసుకుంటుంది. అందుకే మనకు ఒక రోజుకు 24 గంటలు సమయం ఇచ్చారు. ఇందులో 12 గంటలు పగలు.. 12 గంటలు రాత్రి ఉంటుంది. అయితే తాజాగా భూమి తిరిగే వేగం పెరగడం గమనార్హం.

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 24 గంటల్లో పూర్తి చేసుకోవాలి. కానీ ఈనెల 26న భూమి 1.50 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తి చేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సెకన్ లో వెయ్యో వంతును మిల్లీ సెకన్ గా లెక్కిస్తారు. 1960 జులై 19న 1.47 మిల్లీ సెకన్లు. గత నెల 29న 1.59 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణం పూర్తయ్యిందట.. ప్రస్తుత సంవత్సరంలో భూమి ఇంత వేగంగా తిరుగుతూ ఉన్నట్లయితే అంతర్జాతీయ భూభ్రమణ చరిత్రలో తొలిసారిగా నెగెటివ్ లీపు సెకనును జోడించాల్సిన అవసరం ఉంటుందని బావిస్తున్నారు.

భూమి పరిభ్రమణ వేగం పెరగడానికి వివిధ కారణాలను శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి సముద్ర మట్టాలు కావచ్చు.. భూమిలోపల మార్పులు వంటివి కావచ్చు. మరో అంశం ఏంటంటే.. చంద్రుడు భూమి నుంచి దూరంగా కదులుతుండడం.. సాధారణంగా భూమి వేగం మందగించడానికి ఒఖ లీప్ సెకండ్ ప్రతీసారి ప్రవేశపెడుతుంది. 2020 వరకూ సాధారణంగానే ఉన్న భూభ్రమణం.. ఇప్పుడు మళ్లీ వేగవంతమైందని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.

గత 50 ఏళ్లలో కంటే భూమి ఇప్పుడు వేగంగా తిరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల అన్ని దేశాల సమయాలు మారుతాయని.. సౌరసమయం.. ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ పరికరాలు అమర్చబడినందున కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నావిగేషన్ వ్యవస్థపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందంటున్నారు.