Begin typing your search above and press return to search.
ప్రయాణికులకు చుక్కలు చూపిన తిరుపతి విమానం
By: Tupaki Desk | 15 Jan 2022 5:30 AM GMTపండగ పూట అనుకున్నసమయానికి గమ్యస్థానానికి చేరేలా ప్లాన్ చేసుకున్న ప్రయాణికులకు వాతావరణం భారీగా దెబ్బేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి వెళ్లాల్సిన స్పైస్ జెట్ ప్రయాణికులకు అనుకోని అనుభవం ఎదురైంది. శుక్రవారం ఉదయం పండగ కావటం.. తిరుమల దర్శనాల కోసం పొద్దున్నే తిరుపతి ప్రయాణాన్ని పెట్టుకున్నారు. ఉదయమే తిరుపతికి చేరుకొని.. రాత్రికి నగరానికి తిరిగి వచ్చేలా కొందరు ప్లాన్ చేసుకుంటే.. మరికొందరు పండక్కి ఊరెళ్లేందుకు వీలుగా టికెట్లను బుక్ చేసుకున్నారు.
షెడ్యూల్ లో భాగంగా శుక్రవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరింది. అనుకున్న సమయానికి తిరుపతికి విమానం చేరుకున్నా.. అక్కడ దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో.. విమానం ల్యాండ్ అయ్యేందుకు అక్కడి ఏటీసీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో.. చేసేదేమీ లేక.. మళ్లీ హైదరాబాద్ కు తిరిగివచ్చింది. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకున్న విమానం.. శంషాబాద్ లో ల్యాండ్అయ్యింది.
చివరకు తిరుపతిలో పొగమంచు తగ్గినట్లుగా తిరుపతి ఏటీసీ నుంచి సమాచారం అందిన తర్వాత.. మళ్లీ హైదరాబాద్ నుంచి తిరుపతికిబయలుదేరి వెళ్లింది. శుక్రవారం ఉదయం 10.15 గంటల వేళలో హైదారబాద్ నుంచి తిరుపతికి బయలుదేరింది. అంటే.. ఉదయం 7.30 గంటలకు తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానం.. ఉదయం 11.30 గంటల వేళలో చేరుకుంది. దీంతో.. ప్రయాణికులు పరేషాన్ అయ్యారు.