Begin typing your search above and press return to search.
ఆటగాళ్లకు సర్వర్ గా మారిన కేంద్రమంత్రి!
By: Tupaki Desk | 28 Aug 2018 10:38 AM GMTఅవును.. మీరు చదివింది అక్షరాల నిజం. కేంద్రమంత్రి ఒకరు ఆటగాళ్లు.. క్రికెటర్లు కాదు సుమా.. అథ్లెట్లకు తినుబండారాలు సర్వ్ చేసిన వైనం తాజాగా చోటుచేసుకుంది. ఇప్పుడు నడుస్తున్న బయోపిక్ ల్లో ఏ క్రీడాకారుడి బయోపిక్ లోనూ కనిపించని కొత్త దృశ్యాన్ని ఆవిష్కరించారు కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్. క్రికెటర్లుకాని క్రీడాకారుల్ని కేంద్రమంత్రి హోదాలో ఉన్న నేత పలుకరించటమే ఎక్కువైన వేళ...అథ్లెట్లను స్వయంగా పలుకరించి ప్రశంసల వర్షం పొందుతున్నారు కేంద్రమంత్రి. ఇంతకీ అసలే జరిగిందంటే..
ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో తాజాగా ఆసక్తికర సీన్ ఒకటి చోటు చేసుకుంది. పోటీల నేపథ్యంలో ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఒలింపిక్ పతక విజేత కమ్ కేంద్ర క్రీడాశాఖామంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తాజాగా ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. ఆటగాళ్లను స్వయంగా కలుసుకొని వారితో మాట్లాడుతున్నారు.
అదే సమయలో పతకం సాధించిన ఆటగాళ్లకు ట్విట్టర్ లో ఎప్పటికప్పుడే అభినందిస్తున్నారు. తాజాగా ఆటగాళ్లు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న వేళ.. అక్కడికి వెళ్లారు కేంద్రమంత్రి. అయితే.. తమ గొడవలో తాము ఉన్న క్రీడాకారులు కేంద్రమంత్రి వచ్చిన విషయాన్ని గుర్తించలేదు. ఎవరి పనిలో వారు బిజీబిజీగా ఉన్నారు.
డైనింగ్ హాల్లోకి వెళ్లిన రాథోఢ్.. బౌల్స్ లో సూప్.. టీ పోసుకొని ప్లేట్లలో పెట్టుకొని ఆటగాళ్ల కోసం తీసుకెళ్లారు. తమ ముందు వచ్చిన వ్యక్తిని కేంద్రమంత్రిగా గుర్తించి ఒక్కసారిగా సర్ ప్రైజ్ గా ఫీలయ్యారు ఆటగాళ్లు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మంత్రి తీరును పలువురు అభినందిస్తున్నారు. మొత్తానికి భారత క్రీడాకారుల కృషిని గుర్తించే మంత్రి ఇన్నాళ్లకు ఒకరు దొరికారన్న మాట.