Begin typing your search above and press return to search.
ఆ కరోనా టీకా పై అసత్యాలు ప్రచారం ... ఓ పీఆర్ ఏజెన్సీ దుర్మర్గాపు చర్య !
By: Tupaki Desk | 26 May 2021 11:56 AM GMTప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా విజృంభణ తో అల్లాడిపోతోంది. ఓ వైపు రోజురోజుకి పెరిగిపోతోన్న కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు , మరోవైపు లెక్కకి అందని కరోనా మరణాలు. ఈ తరుణంలో ప్రజలు కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పలు దేశాలు టీకాల కొరతతో ఇబ్బంది పడుతుండగా, కొన్ని ఫార్మ కంపెనీలు మాత్రం వ్యాక్సిన్ ల గురించి అసత్యాలు ప్రచారం చేసే పనిలో ఉన్నాయి. ఈక్రమంలో రష్యాతో సంబంధం ఉన్న ఓ పీఆర్ ఏజెన్సీ పైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ గురించి అసత్యాలు ప్రచారం చేయాల్సిందిగా యూరోప్ కు చెందిన పలు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, బ్లాగర్స్ ను కాంటాక్ట్ అయినట్లు తెలిసింది.
రష్యాతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఈ పీఆర్ ఏజెన్సీ ఫైజర్ వ్యాక్సిన్ గురించి ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్, యూట్యూబ్ లో తప్పుడు వార్తలు పోస్ట్ చేయాల్సిందిగా పలువురు బ్లాగర్స్ ని కోరినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ .. ఆస్ట్రాజెనికాతో పోల్చితే, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మరణాలు 3 రెట్లు అధికంగా ఉన్నట్లు ప్రచారం చేయాల్సిందిగా ఓ పీఆర్ ఏజెన్సీ నన్ను కోరింది. అంతేకాక పైజర్ వ్యాక్సిన్ ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వాలని ప్రశ్నించాల్సిందిగా మమ్మల్ని అభ్యర్థించింది అని తెలిపాడు. పలువురు ఇన్ ఫ్లూయెన్సర్ పైజర్ గురించి పుకార్లు వ్యాప్తి చేయాల్సిందిగా ఏజెన్సీ తమను సంప్రదించాయని వెల్లడించడమే కాక ఇందుకు సంబంధించిన సాక్ష్యాలని కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. మిలియన్ల మంది సబ్ స్క్రైబర్స్ కలిగిన ప్రసిద్ధ పోడ్కాస్ట్ హోస్ట్ అయిన మిర్కో డ్రోట్ష్మాన్ తనకు వచ్చిన ఇమెయిల్ స్క్రీన్ షాట్ ను ట్విటర్ లో షేర్ చేశాడు. ఇన్ ఫర్మేషన్ క్యాంపెయిన్ లో భాగంగా ఫైజర్ వ్యాక్సిన్ వల్ల అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని ప్రచారం చేయాల్సిందిగా తనను కోరారని మిర్కో డ్రోట్ష్మాన్ ట్వీట్ చేశాడు. అంతేకాక పోడ్కాస్ట్ సబ్ స్క్రైబర్స్ లో ఎక్కువ మంది ఏ వయసు వారు ఉన్నారు..ఈ పని చేయడానికి ఎంత డబ్బు తీసుకుంటారో తెలపాల్సిందిగా కోరినట్లు మిర్కో కోరాడు.