Begin typing your search above and press return to search.
అత్యంత తక్కువ ధరకే 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్..ఒక్కో డోసు ఎంతంటే?
By: Tupaki Desk | 25 Nov 2020 1:00 PM GMTకరోనా వైరస్ ను సమూలంగా నిర్ములించే వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు చాలా వరకు తుది దశలో ఉన్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లుగా ఫైజర్, మోడర్నా కంపెనీల ప్రకటించారు. తాజాగా తాము తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని రష్యా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ధర ఒక డోసుకు అంతర్జాతీయ మార్కెట్లో 10 డాలర్లు మాత్రమే. అంటే సుమారు రూ. 740 రూపాయల లోపే ఉంటుందని, ఇది రెండుడోసులు తీసుకోవాల్సి వస్తుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హెడ్ కిరిల్ దిమిత్రోవ్ తెలిపారు. పలు సంస్థల వ్యాక్సిన్ తో పోల్చి చుస్తే , ఈ ధర చాలా తక్కువే.
క్లినికల్ ట్రయల్స్ లో ధ్రువీకరించిన 39 కేసులు, రెండు డోసులు తీసుకున్న 18 వేల 794 మంది వాలంటీర్ల లో స్పుత్నిక్ వీ 28వ రోజు 91.4%, 42 వ రోజు 95 % ప్రభావవంతంగా పని చేస్తోందని తేలిందని ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత సమర్ధంగా పని చేస్తున్న వ్యాక్సిన్ తమదేనని, ఇక మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో 40 వేల మంది వాలంటీర్లు పాల్గొంటున్నారని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్‌లో ధ్రువీకరించిన 39 కేసులు, రెండు డోస్‌లు తీసుకున్న 18,794 మంది వాలంటీర్లలో స్పుత్నిక్- వీ 28 వ రోజు 91.4 శాతం, 42 వ రోజు 95 శాతంపైగా ప్రభావవంతంగా పనిచేస్తోందని తేలిందని ప్రకటించింది.
బెలారస్, యూఏఈ, వెనిజులా తోపాటుగా భారత్లోనూ మూడవదశ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి లభించినట్లు గా వెల్లడించింది. 2021 మొదటి త్రైమాసికానికి 50 కోట్ల డోసుల ఉత్పత్తి ప్రారంభించేలా పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఆగస్టులోనే ఈ వ్యాక్సిన్ కు రష్యా ఆమోదం తెలపడంతో, ప్రపంచంలోనే క్లినికల్ ట్రయల్స్ ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్ గా స్పుత్నిక్ వీ కి గుర్తింపు దక్కుతుంది. ప్రస్తుతం స్పుత్నిక్ వీ ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి మరియు భారతదేశంలో పంపిణీ చేయడానికి హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డి మరియు ఆర్డిఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలకు వ్యతిరేకంగా టీకాకు ధర ప్రయోజనం ఉన్నప్పటికీ, ప్రత్యేకమైన శీతలీకరణ చేయవలసిన పరిస్థితులు తప్పనిసరి కాబట్టి పంపిణీ సవాల్ గా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.