Begin typing your search above and press return to search.
స్పుత్నిక్ -వీ కూడా వచ్చేస్తోంది..
By: Tupaki Desk | 12 Jan 2021 9:30 AM GMTత్వరలోనే మనదేశం కరోనా ఫ్రీ కంట్రీగా మారబోతుందా? దేశప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారా? అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగంగా సాగుతున్నాదా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ అత్యవసర వ్యాక్సినేషన్‌కు అనుమతులు వచ్చాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను ఇప్పటికే సీరం నుంచి వివిధ ప్రాంతాలకు పంపిణీచేశారు. దేశవ్యాప్తంగా 13 నగరాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్, విజయవాడ ఈ నగరాల జాబితాలో ఉన్నాయి.
ఈ నెల 16 నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ మొదలుపెట్టనున్నారు. మరోవైపు త్వరలోనే భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్‌ను కూడా త్వరలోనే పంపిణీ చేయనున్నారు. అయితే తాజాగా రష్యా తయారుచేసిన స్పుత్నిక్ -వీ వ్యాక్సిన్‌పై మరో కీలక ముందడుగు పడింది. ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన రెడ్డిల్యాబ్స్ అభివృద్ధి చేస్తున్నది. అయితే స్పుత్నిక్‌వీ వ్యాక్సిన్ ఇప్పటికే ఒకటి రెండో దశ ట్రయల్స్ పూర్తయ్యాయి. మూడోదశ ట్రయల్స్ కోసం అనుమతి ఇవ్వాలంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు రెడ్డి ల్యాబ్స్ లేఖ రాసింది. అనుమతి రాగానే 31 వేలమంది వలంటీర్స్‌కు ఈ వ్యాక్సిన్‌ను అందజేసి పర్యవేక్షించునున్నారు.
మరోవైపు రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ఇప్పటికే రష్యా, అర్జెంటీనాలో అనుమతి వచ్చింది. ఈ వ్యాక్సిన్ ఎంతో సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తుందని.. రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో యాంటీబాడీలు అభివృద్ధి చేయడంతో ఆ వ్యాక్సిన్ సత్ఫలితాలు చూపించిందని అక్కడి శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోవైపు అమెరికాలో ఇప్పటికే ఫైజర్ వ్యాక్సినేషన్ పంపిణీ చేశారు. మరోవైపు బ్రిటన్‌లో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లతోపాటు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌కు కూడా అనుమతి వచ్చింది. కరోనాను తరిమికొట్టే రోజు మరెంతో దూరంలో ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.