Begin typing your search above and press return to search.

వచ్చేవారం నుంచి ఇండియా లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ !

By:  Tupaki Desk   |   14 May 2021 4:38 AM GMT
వచ్చేవారం నుంచి ఇండియా లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ !
X
కరోనా మహమ్మారి విజృంభణ మనదేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఎటువంటి సమయంలో మన ముందున్న ఏకైక లక్ష్యం వ్యాక్సిన్ వేసుకోవడమే. అయితే ప్రస్తుతానికి దేశంలో రెండు రకాల వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉండటం తో దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని వచ్చే వారం నుంచి భారత్ లో అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు మాత్రమే పంపిణీ చేస్తుండగా, ఇకపై మూడో వ్యాక్సిన్ కూడా రానుండడంతో వ్యాక్సిన్ కష్టాలు కొద్దిమేర తీరతాయని భావిస్తున్నారు.

రష్యాలో తయారైన కరోనా వైరస్ స్పుత్నిక్ వి.వ్యాక్సిన్ ఇండియాకు చేరిందని నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి.కె. పాల్ తెలిపారు. వచ్చేవారం నుంచి ఇది మన మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని ఆయన గురువారం వెల్లడించారు. రష్యా నుంచి మరిన్ని డోసుల వ్యాక్సిన్ వస్తుంది అని అన్నారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేయనుంది. కాగా, ఈ నెలాఖరుకు 30 లక్షల స్పుత్నిక్ వి డోసులు భారత్ చేరుకోనున్నాయి. మరోపక్క, ఇటీవల 1.5 లక్షల స్పుత్నిక్ వి డోసులు హైదరాబాదు చేరుకున్న విషయం విదితమే. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను రష్యాకు చెందిన గమలేయా నేషనల్ సెంటర్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అధికారికంగా ఆమోదం పొందిన తొలి కరోనా వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. అయితే, ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విషయంలో రష్యా తన సమాచారాన్ని ఇతర దేశాలతో ఎందుకు షేర్ చేసుకోలేదన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఏమైనా. స్పుత్నిక్ వి.వ్యాక్సిన్ విషయంలో లోగడగల సందేహాలన్నీ నివృత్తి అయ్యాయని నిపుణులు అంటున్నారు.