Begin typing your search above and press return to search.
ఇండియాలో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఉత్పత్తి ... 'సీరం'కి డీజీసీఐ అనుమతి !
By: Tupaki Desk | 5 Jun 2021 3:30 PM GMTపూణెకి చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ మరో కరోనా వైరస్ వ్యాక్సిన్ ను భారత్ లో ఉత్పత్తి చేయనుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు కూడా రావడంతో త్వరలోనే ఉత్పత్తిని మొదలుపెట్టనుంది. భారత్ లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసేందుకు సీరమ్ ఇన్ స్టిట్యూట్‌కు డీసీజీఐ కొన్ని షరతులకు లోబడి అనుమతి మంజూరు చేసింది. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే రెండు విడతలుగా ఇండియాకు చేరింది. దీన్ని ఇండియాలో తాము తయారు చేస్తామని, ఇందుకు అనుమతించాలని సీరం కంపెనీ ఇటీవలే డీజీసీఐకి దరఖాస్తు పెట్టుకుంది. దీంతో ఈ టీకామందు ఎగ్జామినేషన్, టెస్ట్, ఎనాలిసిస్ తదితరాలను నిర్వహించి ఉత్పత్తి ప్రారంభించాలని డ్రగ్స్ సంస్థ సూచించింది.
ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి విషయమై సీరం సంస్థ రష్యాకు చెందిన గమలేయా రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఎపిడెర్మాలజీ అండ్ మైక్రో బయాలజీ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. ఇప్పటికే దేశీయంగా ఆదార్ పూనావాలా ఆధ్వర్యంలోని సీరం సంస్థ ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకామందును కోవీషీల్డ్ వ్యాక్సిన్ పేరిట తయారు చేస్తోంది. ఈ జూన్ నెలలో తాము 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ ని అందజేస్తామని ఈ కంపెనీ భారత ప్రభుత్వానికి హామీనిచ్చింది. ఇదే సంస్థ నోవావాక్స్ వ్యాక్సిన్ ని కూడా మాన్యుఫాక్చర్ చేస్తున్నప్పటికీ దీనికి అమెరికా రెగ్యులేటరీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇటీవలే ఈ అనుమతి కోసం ఈ సంస్థ యూఎస్ రెగ్యులేటరీకి దరఖాస్తును పంపినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ఆ మధ్య వివిధ వ్యాక్సిన్ తయారీ సంస్థలను సందర్శించి ఉత్పత్తిని మరింతగా పెంచాలని కొరిన విషయం గమనార్హం.
దాంతో 14-44 ఏళ్ళ మధ్య వయస్కులవారికి కూడా టీకామందు లభించేలా చూసేందుకు సీరం కంపెనీతో బాటు భారత్ బయో టెక్ కూడా తమ ఉత్పత్తులను పెంచేందుకు నడుం కట్టాయి. ఇలా ఉండగా..ఇండియాలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కి సంబంధించి 250 మిలియన్ డోసుల అమ్మకానికి హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్..రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.ఇప్పటికే కోవాక్సిన్ వ్యాక్సిన్‌ను సీరమ్ భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది. త్వరలోనే స్పుట్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా మొదలుపెడితే దేశంలో కోవిడ్ వ్యాక్సిన్లు భారీ సంఖ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.