Begin typing your search above and press return to search.

ఆ రెండు సీట్లలో ఇండిపెండెంట్ గా ఎస్పీవై!

By:  Tupaki Desk   |   18 March 2019 5:21 PM GMT
ఆ రెండు సీట్లలో ఇండిపెండెంట్ గా ఎస్పీవై!
X
ఒకటి కాదు.. రెండు సీట్లలో తన కుటుంబీకులు ఇండిపెండెంట్స్ గా పోటీలో ఉంటారని ప్రకటించారు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి. అనేక పరిణామాల అనంతరం.. ఎస్పీవై నుంచి ఈ మేరకు ప్రకటనలు వస్తూ ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఈ వృద్ధ నేత, ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే చంద్రబాబును కలిశారు. ఈయన ఎంపీనే అయినా అధికార పార్టీ నేత అనిపించుకోవడానికి అలాంటి పని చేశారు.

ఇక ఫిరాయించి ఐదేళ్లు అయినా.. ఈయనపై వేటు పడలేదు. దర్జాగా ఎంపీగా చలామణి అయ్యారు - అవుతున్నారు. ఇక ఇప్పుడు టీడీపీ తరఫున మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. తను కాకపోయినా..తన కుటుంబీకుల్లో ఎవరో ఒకరికి టికెట్ కేటాయించాలని ఎస్పీవై బాబు చుట్టూ రౌండ్లు కొట్టారు.

నంద్యాల ఎంపీ టికెట్ కానీ - నంద్యాల అసెంబ్లీ టికెట్ కానీ… కేటాయించాలని ఎస్పీవై కోరుతూ వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విన్నపాలను పట్టించుకోలేదు. ఎస్పీవై కోరిక మేరకు ఎంపీ టికెట్ కానీ - ఎమ్మెల్యే టికెట్ కానీ కేటాయించడం లేదు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో పూర్తి స్పష్టత రానే వచ్చింది. ఈ పరిణామాల మధ్యన ఎస్పీవై స్పందిస్తున్నారు.

ఇండిపెండెంట్ గా పోటీ ఖాయమని చెబుతున్నాటర అనుచవర్గంతో. కేవలం ఒక సీటు నుంచి కాదు, నంద్యాల ఎంపీ సీటు నుంచి, నంద్యాల ఎమ్మెల్యే సీటు నుంచి తన వాళ్లు ఇండిపెండెంట్స్ గా పోటీలో ఉంటారని ఎస్పీవై ప్రకటించారు. దశాబ్దాలు నంద్యాల రాజకీయంలో తనమునకలై ఉన్న మనిషి కావడంతో ఎస్పీవై ప్రకటన ఆసక్తిని రేపుతూ ఉంది.

అయితే ఎస్పీవై సీరియస్ గానే ఇండిపెండెంట్స్ గా తన వాళ్లను పోటీ చేయిస్తారా.. లేక.. ఇదంతా ఉత్తుత్తి హడావుడి మాత్రమేనా.. నామినేషన్ల విత్ డ్రా నాటికి చేతులు ఎత్తేస్తారా..లేక పోటీ చేసి తెలుగుదేశానికి ఝలక్ ఇస్తారా? అనేది వేచి చూడాలి!