Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ ఎన్టీఆర్ అరుదైన ఫొటో వెన‌క క‌థ ఇదే

By:  Tupaki Desk   |   4 Nov 2016 6:48 AM GMT
సీనియ‌ర్ ఎన్టీఆర్ అరుదైన ఫొటో వెన‌క క‌థ ఇదే
X
కొన్ని అరుదైన ఫొటోలు అద్భుత‌మైన మెసేజ్‌ల‌ను పాస్ చేస్తాయి. ఇక‌, ఆ ఫొటోలే ఏ ప్ర‌ముఖుల‌వో అయితే.. మ‌రీ ముఖ్యంగా సీనియ‌ర్ ఎన్‌టీఆర్‌వే అయితే.. చెప్పేదేముందుంటుంది.. తీసి దాచుకోవ‌డం త‌ప్ప‌! ఇప్పుడ‌లాంటి ఫొటోనే ఒక‌టి మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఎన్‌ టీఆర్ టీడీపీని పెట్టిన కొత్త‌లో తీసిన ఫొటో ఇది. కారులో కాలుమీద కాలేసుకుని కూర్చున్న ఎన్‌ టీఆర్ ఏదో ప‌దార్ధాన్ని ఆబ‌గా లాగించేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది క‌దూ! అవును. ఆయ‌నకు ఫుడ్ మీద ఉన్న ఇంట్ర‌స్టుకు సంబంధించినదే ఈ ఫొటో వెనుక ఉన్న రియ‌ల్ స్టోరీ. వాస్త‌వానికి రైతు కుటుంబం నుంచి ఇచ్చిన ఎన్‌ టీఆర్ నిజంగానే పాలు - మీగ‌డ‌ల మ‌ధ్యే త‌నలైఫ్‌ ని స్టార్ట్ చేశారు. సో.. ఆయ‌న‌కి స‌హ‌జంగానే ఆహారంపై మ‌క్కువ ఎక్కువ.

ముఖ్యంగా జున్నంటే ఆయ‌న ప్రాణం పెట్టేవార‌ని చెబుతారు. జున్నును ఎంత‌గా ఇష్ట‌ప‌డే వారంటే.. ఆయ‌న‌కు షుగ‌ర్ వ్యాధి సంక్ర‌మించాక కూడా జ‌న్నును వ‌ద‌ల‌లేద‌ట‌! జున్ను క‌నిపించినా, ఎవ‌రైనా తెచ్చి ఇచ్చినా.. ఎంత‌మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఆబ‌గా లాగించేసేవార‌ట ఎన్‌ టీఆర్‌. అదేవిధంగా ఉల‌వ‌చారు - నాటుకోడి గుడ్లు - మీగ‌డ‌ను ఎంతో ఇష్టంగా తినేవార‌ట‌. ముఖ్యంగా ఆయ‌న పార్టీని స్థాపించిన కొత్త‌లో చైత‌న్య ర‌థం పేరిట కాంగ్రెస్ ఆగ‌డాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. దీంతో ఆయ‌న ఓ బ‌స్సులో ఈ యాత్ర చేప‌ట్టారు. భోజ‌నం - స్నానం అన్నీ రోడ్ల మీదే చేసేసేవారు.

అయితే, ఆయ‌న గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్న క్ర‌మంలో అనేక మంది రైతులు త‌మ ఇళ్ల‌కు రావాల‌ని కోరార‌ట‌. అయితే, ఎన్‌ టీఆర్ త‌న యాత్ర ల‌క్ష్యం వేరే ఉంద‌ని చెబుతూ.. అన్నీ రోడ్ల మీదే చేసేవారు. దీంతో ఆయా రైతులు ఎన్‌ టీఆర్ ఇష్టాఇష్టాలు తెలుసుకుని ఆహారాన్ని ఆయ‌న చైత‌న్య ర‌థం వ‌ద్ద‌కే పంపేవార‌ట‌. అలా ఓ రైతు కుటుంబం పంపిన ఆహారాన్ని కారులో కూర్చుని తింటుండ‌డగా తీసిన ఫొటోనే ఇది. ఈ విష‌యాన్ని ఉమ్మ‌డి ఏపీలో డీజీపీగా, దానికి ముందు ఎన్‌ టీఆర్ హ‌యాంలో ఇంటెలిజెన్స్ అధికారిగా ప‌నిచేసిన హెచ్‌.జే. దొర వెల్ల‌డించారు. ఆయ‌న ఎన్‌టీఆర్‌ తో నేను అనే పుస్త‌కం రాశారు. దానిలో ఈ ఫొటోను ఆయ‌న ప్ర‌ముఖంగా ప్ర‌చురించ‌డంతోపాటు విష‌యాన్ని ఆస‌క్తిగా వివ‌రించారు. సో.. సీనియ‌ర్ ఎన్‌టీఆర్ అరుదైన ఫొటో వెనుక స్టోరీ ఇది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/