Begin typing your search above and press return to search.
శిరీష ఎపిసోడ్‌లో శ్రవణ్ డబుల్ గేమ్?
By: Tupaki Desk | 22 Jun 2017 5:03 AM GMTశిరీష విషయంలో డబుల్ గేమ్ ఆడటమే శిరీష ప్రాణాలు పోయేలా చేశాయా? ఓపక్క స్నేహితుడిగా వ్యవహరిస్తునే.. మరోపక్క ఆమెను ఎస్ ఐకి ఎరగా వేయటానికి శ్రవణ్ పావులు కదిపాడా? అన్న సందేహాలు కలిగేలా అతడి ప్రవర్తన ఉందని చెబుతున్నారు. పోలీసులు సేకరించించిన ప్రాధమిక ఆధారాల ప్రకారం.. శ్రవణ్ ఆడిన డబుల్ గేమ్ శిరీష అనూహ్య నిర్ణయాన్ని తీసుకోవటానికి కారణంగా మారినట్లుగా భావిస్తున్నారు.
శిరీషకు ఫ్రెండ్ అయిన శ్రవణ్ అనూహ్యంగా వ్యవహరించినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. కుకునూరుపల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డితో శ్రవణ్ మాట్లాడిన ఫోన్ కాల్స్‌ను సేకరించిన పోలీసులు వాటిని విశ్లేషించగా.. బ్యూటీషియన్ శిరీషను ఎరగా వేయాలని భావించినట్లుగా తెలుస్తోందని చెబుతున్నారు. శిరీష సిటీలో లీడింగ్ బ్యూటీషియన్ అని.. ఆమెకు ఫేవర్ చేస్తే ఫ్యూచర్లో తమకు బాగా కలిసి వస్తుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. శిరీషను తాను తీసుకొస్తానని చెప్పినట్లుగా చెబుతున్నారు.
ఇందులో భాగంగానే రాజీవ్ తో మరో కోణంలో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. తేజస్వినితో ఎఫైర్ ఉన్న రాజీవ్‌తో మాట్లాడే సమయంలో శిరీషను వదిలించుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది. శిరీషను వదిలించుకుందాం.. నీకు ఇష్టమేనా? అని రాజీవ్‌ను అడిగిన శ్రవణ్.. అందుకు ఓకే అనటంతో అందుకు ఎస్ ఐకి కాస్త ఫేవర్ చేయాలని శ్రవణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. తేజస్వినిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న రాజీవ్.. శిరీషను వదిలించుకునే క్రమంలో భాగంగా శ్రవణ్ డబుల్ గేమ్‌కు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంత రాత్రి వేళ.. హడావుడిగా సెటిల్ మెంట్ పేరుతో కుకునూరుపల్లి ఎస్ ఐ దగ్గరకు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ వాదనపై పోలీసులు ఎలా స్పందిస్తారో?