Begin typing your search above and press return to search.
కేసీఆర్ సర్కారుకు ఈసీ తాబేదారా?
By: Tupaki Desk | 23 Feb 2016 1:39 PM GMTతెలంగాణ రాష్ట్ర అధికారపక్షంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి పలు అవకతవకలు జరుగుతున్నాయని..ఈవీఎంలు ట్యాంపరింగ్‌లు జరిగాయని విమర్శలు చేస్తున్న ఆయన ఈసారి తన ఆరోపణల ఘాటు మరింత పెంచారు. త్వరలో జరిగే ఖమ్మం.. వరంగల్ నగర కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఈవీఎంలకు ప్రింటర్లు పెట్టాలని హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సంఘం మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ సర్కారుకు ఈసీ తాబేదారుగా వ్యవహరిస్తుందన్న ఆయన.. తాను వేసిన పిటీషన్ పై హైకోర్టు స్పందిస్తూ.. ఈవీఎంకు ప్రింటర్లు లేకుండా ఎలా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించిన విషయాన్ని చెప్పారు. అంతేకాదు.. ఈ అంశం మీద మార్చి 15 లోపు కౌంటర్ పిటీషన్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించిందని వెల్లడించారు.
ఏదైనా విషయాన్ని పట్టుకుంటే తుదికంటా చూసే వరకూ నిద్ర పోనట్లుగా వ్యవహరిస్తున్న శ్రవణ్.. ఈవీఎంల విషయం మీద ఆయన చేస్తున్న పోరాటం ఎంతవరకు కొనసాగిస్తారో చూడాలి. ఏమైనా.. ఎన్నికల సంఘం మీద శ్రవణ్ వ్యాఖ్యలు తీవ్రమైనవిగానే పరిగణించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఆయన న్యాయపోరాటం ఎంతవరకు వెళుతుందో చూడాలి.