Begin typing your search above and press return to search.

శ్రీ‌భ‌ర‌త్‌... సామాన్యుడు కాదే !

By:  Tupaki Desk   |   31 Dec 2019 6:30 PM GMT
శ్రీ‌భ‌ర‌త్‌... సామాన్యుడు కాదే !
X
విశాఖ‌ప‌ట్నం ఎంపీ సీటు. ఇది హాట్ కేక్‌. రాష్ట్రంలో ప్రొటోకాల్ ప‌రంగా ఇది టాప్ ఎంపీ సీటు. ఇంకా ఎన్ని ర‌కాలుగా చూసినా ఈ సీటుకు డిమాండ్ ఎక్కువ‌. అయితే, తెలుగుదేశంలో ఈ సీటుపై ఎపుడూ లేనంత మ‌ద‌నం జ‌రిగింది. గ‌త ఎన్నిక‌ల్లో వ్యూహాత్మ‌కంగా ఈ సీటును బీజేపీకి ఇచ్చారు. ఇపుడు పొత్తు లేదు. ఈ నేప‌థ్యంలో ఈ సీటు ద‌క్కించుకోవ‌డానికి తెలుగుదేశం సీనియ‌ర్ నేత మూర్తి మ‌న‌వ‌డు, బాల‌కృష్ణ రెండో అల్లుడు అయిన శ్రీ‌భ‌ర‌త్ పోటీ ప‌డ్డారు. ఇక చంద్ర‌బాబు కుటుంబం నుంచే పోటీలో ఉండ‌టంతో ఇత‌రులు ఎవ‌రూ ఈ ఎంపీ సీటుపై ఆశ పెట్టుకోలేదు. అయినా కూడా అక్క‌డ ఎవ‌రినయినా వేరే వారిని నిల‌బెడ‌దామా అని చంద్ర‌బాబు ఆలోచించినా... చివ‌ర‌కు శ్రీ‌భ‌ర‌త్ కే దక్కింది. కాదు.. కాదు... ఆ సీటు ఇవ్వాల్సివ‌చ్చింది.

అయితే, శ్రీ‌భ‌ర‌త్ రాజ‌కీయాల్లో పోటీకి కొత్త వ్య‌క్తి గాని... రాజ‌కీయ వ్యూహాల‌కు కాద‌ని తెలుస్తోంది. అత‌ను అన్నీ ముందు జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా విశాఖ పార్ల‌మెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను తన కోటరీగా మార్చుకోగ‌లిగారు. కుటుంబం నుంచి వ్యూహాల‌ను వార‌స‌త్వంగా నేర్చుకున్న‌ట్టున్నాడు. అందుకే చంద్ర‌బాబు భ‌ర‌త్‌కు తొలుత టిక్కెట్ ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌క‌పోయినా ఇవ్వకుండా ఉండ‌లేని ప‌రిస్థితుల‌ను క్రియేట్ చేశాడు. అయితే, దీనికి భ‌ర‌త్ అనుస‌రించిన వ్యూహం ఇపుడు హాట్ టాపిక్‌. భ‌ర‌త్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల చొప్పున ఎన్నిక‌ల నిధి ఇచ్చిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

చిత్ర‌మేంటంటే... గంటా మ‌ద్ద‌త‌ను కూడా శ్రీ‌భ‌ర‌త్ సంపాదించ‌గ‌లిగారు. ఆయ‌న కు టిక్కెట్ ద‌క్కేలా వ్యూహాత్మ‌క లాబీయింగ్ చేసిన బృందానికి నాయ‌క‌త్వం కూడా గంటాదే. పైగా త‌న స్థానం మార్చినందుకు గంటాకు మ‌న‌సు చివుక్కుమంది. ఆ టైంలో గంటాను భ‌ర‌త్ బాగా టాప్ చేశారంటున్నారు. ఏదేమైనా ఒక కొత్త అభ్య‌ర్థి ప్ర‌త్యేక కోట‌రిని ఏర్ప‌రుచుకుని వివాద‌రహితంగా టిక్కెట్ సాధించుకోవ‌డం గ‌ట్టి విజ‌య‌మే.

అయినా పార్టీలో మ‌నిషి, బంధువు అయిన వ్య‌క్తికి టిక్కెట్ ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు ఎందుకు ఇంత స్ట్ర‌గుల్ అవుతున్నాడ‌ని చాలా మందికి అనుమానాలు క‌లుగుతున్నాయి. వాట‌న్నిటికీ స‌మాధానం లోకేష్ ఫ్యూచ‌ర్‌.