Begin typing your search above and press return to search.
శ్రీ కంచి కామకోటి పీఠం వారి కాలేజీలో అమ్మాయిలు నలుగురు మిస్సింగ్.. ఏమైంది?
By: Tupaki Desk | 14 May 2022 9:26 AM GMTరోటీన్ కాలేజీలకు భిన్నంగా సంప్రదాయ విద్యను బోధించే కళాశాలకు చెందిన నలుగురు అమ్మాయిలు హాస్టల్ నుంచి పారిపోయిన ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది. అందులోని ఆ కళాశాల.. ప్రఖ్యాత శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే సంప్రదాయ పాఠశాల కావటం మరింత షాకింగ్ గా మారింది. విలువల్ని బోధిస్తూ.. కోర్సుల్ని నిర్వహించే ఈ పాఠశాల చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీపంలోని తొండవాలో ఉంది. భారీ టెన్షన్ కు కారణమైన ఈ ఉదంతం చివరకు సుఖాంతమైంది.
డిగ్రీ చదువుతున్న వీరు.. అర్థరాత్రి వేళ హాస్టల్ గోడ దూకి పారిపోయిన వైనం షాకింగ్ గా మారింది. అసలేం జరిగింది? విద్యార్థినులు ఎందుకు పారిపోయారు? తర్వాతేమైంది? వాళ్లు తిరిగి సురక్షితంగా చేరుకున్నారా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే విషయం ముందు నుంచి తెలుసుకోవాల్సిందే. శ్రీ కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో చంద్రగిరి సమీపంలో సాంప్రదాయ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్లో బాలికలకు మాత్రమే ప్రవేశం. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న నలుగురు అమ్మాయిలు ఇటీవల ఒక అర్థరాత్రి నుంచి కనిపించటం మానేశారు.
దీంతో ఆందోళన చెందిన స్కూల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించటం.. వారు రంగంలోకి దిగారు. విచారణను షురూ చేశారు. ఈ క్రమంలో వారు గోడ దూకి పారిపోయినట్లుగా తేలింది. నాలుగు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలకుపంపటంతో పాటు.. సోషల్ మీడియా.. మీడియాలో పెద్ద ఎత్తున బాలికల ఫోటోల్ని ప్రసారం చేశారు. దీంతో.. ఈ నలుగురు అమ్మాయిల జాడ లభిస్తుందని ఆశించారు. అందుకు తగ్గట్లే.. మిస్ అయిన నలుగురు అమ్మాయిలు ముంబయిలో ఉన్నట్లుగా గుర్తించారు.
సోషల్ మీడియాలో మిస్సింగ్ అయిన అమ్మాయిల సమాచారాన్ని చూసిన ముంబయికి చెందిన ఒక వ్యక్తి.. వారిని చేరదీయటమేకాదు.. పోలీసులకు సమాచారం అందించారు. తానే వారిని విజయవాడ వైపునకు తీసుకొస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో పోలీసులు అలెర్టు అయ్యారు. తాజాగా వారిని తీసుకొని తిరుపతికి తీసుకొచ్చారు. అసలేం జరిగిందని ఆరా తీశారు. ఈ సందర్భంగా పారిపోయిన నలుగురు విద్యార్థినులు చెప్పిన కారణం తెలిసినంతనే షాక్ తిన్న పరిస్థితి. కళాశాలలోనూ.. హాస్టల్ లోనూ మొబైల్ ఫోన్ ను వినియోగించటం బ్యాన్. ఇందుకు భిన్నంగా ఇద్దరు అమ్మాయిలు.. రహస్యంగా ఫోన్లు హాస్టల్ లోని తమ గదిలో రహస్యంగా దాచారు. అప్పుడప్పడు తమ ఇంట్లోని వారికి ఫోన్లు చేసేశారు.
హాస్టల్ సిబ్బంది తాజాగా ఈ ఫోన్లను పట్టుకోవటం.. దీనికి కళాశాల యాజమాన్యం వారిపై కఠిన చర్యలు తీసుకొన్నారు. ఆరుగురు విద్యార్థినులను వార్షిక పరీక్షలకు అనుమతించమని తేల్చారు. ఈ విషయం తమ తల్లిదండ్రులకు తెలిస్తే సీరియస్ అవుతారన్న భయంతో నలుగురు విద్యార్థినులు హాస్టల్ నుంచి పారిపోవాలని నిర్ణయించారకున్నారు. అలా హాస్టల్ నుంచి పారిపోయిన వారు.. రైల్వేస్టేషన్ కు వెళ్లి ముంబయి చేరుకున్నారు.
వీరి మిస్సింగ్ వ్యవహరాం అందరికి తెలీటంతో.. వీరిని చూసిన వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో కథ సుఖాంతమైంది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. విద్యార్థినులకు ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడతామని.. అంతే తప్పించి ఇలా పారిపోవటం మాత్రం పరిష్కారం కాదని హితవు పలికారు. మొబైల్ ఫోన్ వాడకం ఏమోకానీ.. నలుగురు అమ్మాయిలు మిస్ కావటం మాత్రం స్కూల్ యజమాన్యాన్ని తీవ్రమైన టెన్షన్ కు గురి చేసిందని చెప్పక తప్పదు.