Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ కు మరో సీమాంధ్ర సంఘం మద్దతు
By: Tupaki Desk | 29 Nov 2018 6:38 AM GMTప్రస్తుతం హోరాహోరీగా జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో అందరి చూపు సీమాంధ్ర ఓటర్ల వైపే పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతలు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు తమ ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, వీరిలో అధికార టీఆర్ ఎస్ పార్టీ సీమాంధ్రులు మొగ్గుచూపుతున్నారనే టాక్ ఉంది. అదే సమయంలో మంత్రి కేటీఆర్ ఇప్పటికే వివిధ సంఘాలతో సమావేశం కూడా అయ్యారు. కొన్ని సంఘాలు కూడా తమ మద్దతును టీఆర్ ఎస్ కు అందిస్తామని ప్రకటించారు. తాజాగా, ఓ అసోసియేషన్ బహిరంగంగానే తమ మద్దతు ప్రకటించింది.
తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులను సీఎం కేసీఆర్ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని - ఈ ఎన్నికల్లో మా ఓట్లన్నీ టీఆర్ ఎస్ కే వేస్తామని శ్రీకృష్ణదేవరాయ యూత్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాఘవరావు చెప్పారు. అన్నిరంగాల్లో తమకు ప్రాధాన్యం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో స్పష్టంచేశారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తో కలిసి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలకు వక్రభాష్యం చెప్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం సీమాంధ్రులను తప్పుదారి పట్టిస్తున్నాడని, కులాలను వాడుకొని మోసం చేసే నైజం చంద్రబాబుకే ఉందని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఎన్నడూ మాట్లాడని చంద్రబాబుకు ఎన్నికల సమయంలో సీమాంధ్రులు గుర్తుకువచ్చారని - అన్నదమ్ముల్లా ఉన్న తమమధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని - అలాంటి చర్యలకు పోతే బాబు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
నాలుగున్నర ఏళ్లలో సీమాంధ్రులపై ఎక్కడా దాడి జరిగిన ఘటనలు లేవని - శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉన్నామని చెప్పారు. కులాలకు - మతాలకు - ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను పొందుతూ సీమాంధ్ర ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. 24 గంటల విద్యుత్తు ఎంతో ఉపకరిస్తుందని - తాగునీరు - రవాణా వ్యవస్థ మెరుగుపడ్డాయని - ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాసంక్షేమ టీఆర్ ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని - ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ కావాలని సీమాంధ్రులు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. 119 నియోజకవర్గాల్లో తాము టీఆర్ ఎస్ గెలుపునకు ప్రచారం చేస్తామని అన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా శ్రీకృష్ణదేవరాయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భరత్ నగర్ కాలనీలోని మేజెస్టిక్ గార్డెన్స్ లో ఉదయం 11 గంటలకు ఆత్మీయ సమ్మేళనం - సభ నిర్వహిస్తున్నామని - ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ సలహాదారులు అరవ రామకృష్ణ - నాయకులు అడుసుమిల్లి వెంకటేశ్వర్ రావు - మద్దెంశెట్టి వెంకటేశ్వరరావు - చాగంటి రమేశ్ - కే రమణ తదితరులు పాల్గొన్నారు.