Begin typing your search above and press return to search.

ఆర్బీఐ ‘రూపాయి’ నిర్ణయంతో శ్రీలంక కూ ఉపయోగం..?

By:  Tupaki Desk   |   21 July 2022 11:30 PM GMT
ఆర్బీఐ ‘రూపాయి’ నిర్ణయంతో శ్రీలంక కూ ఉపయోగం..?
X
భారత్ రూపాయి ఇటీవల ఊహించనంత క్షీణత ఏర్పడడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో రూపాయి విలువ పడిపోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పటిష్ట చర్యలు చేపట్టింది. విదేశాల్లో చెల్లింపులు రూపాయల్లో చెల్లింపులు చేసేలా అనుమతి ఇచ్చింది.

అంతేకాకుండా ఎగుమతులు, దిగుమతులు వాణిజ్యం కోసం కొత్త ప్రేమ్ వర్క్ ను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదంలో ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు రూపాయి విలువను కాపాడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో శ్రీలంక దేశంలోనూ భారత రూపాయిని వినియోగించాలని నిర్ణయించారు. దీంతో భారత్ తో పాటు శ్రీలంక దేశానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కమొడిటీస్ ధరలు పెంచడంతో ఆ ప్రభావం భారత రూపాయిపై పడింది. దీంతో రూపాయి క్షీణించి డాలర్ తో పోల్చగా రూ.80 వరకు పడిపోయింది. అయితే రూ.80 పూర్తి స్థాయికి రాకముందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో వివిధ దేశాల్లో రూపాయిల్లో చెల్లింపులు చేసే ప్రక్రియను మొదలు పెట్టింది. ఇప్పటికే ఇరాన్, రష్యా వంటి దేశాల్లో ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. తాజాగా శ్రీలంక దేశంలోనూ ఇదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఇరు దేశాలకు ఆర్థిక లబ్ధి చేకూరనుందని ఆర్బీఐ భావిస్తోంది.

ఇటీవల శ్రీలంక తీవ్ర సంక్షోభంలో ఇరుక్కుపోయింది. 2020లో కరోనా సంక్షోభ సమయంలో 3.5 శాతానికి పడియోంది. అయితే అప్పటి నుంచే ఆ దేశం కోలుకోవడం లేదు. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ 6 శాతానికి క్షీణించనుందని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నందలాల్ వీరసింగ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా రాజకీయ సంక్షోభం కారణంగా దేశంలో మరిన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. అప్పలు తీవ్రం కావడంతో ఇక్కడి ఆర్థిక వ్యవస్థ మరింత కూరుకుపోతుంది.

ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం శ్రీలంకకు ప్రయోజనం చేకూరనుందని అంటున్నారు. భారత్ రూపాయి పడిపోతున్న తరుణంలో ఆర్బీఐ ప్రత్యేక చర్యలు శ్రీలంకలోనూ కొనసాగించాలని నిర్ణయించింది. ఆ దేశంలో కొత్త పెట్టుబడులు ఆకర్షించడంలో ఉపయుక్తంగా మారుతాయని అంటున్నారు. భారతీయ కరెన్సీని వినియోగించి చెల్లింపులు చేస్తే ద్వీప దేశానికి విదేశీ మారక నిల్వలు చాలా వరకు ఆదా అవుతాయని తెలుపుతోంది.

అయితే ఈ చర్యలపై శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, అడ్వకేటియా సీనియర్ అధికారి రోషన్ ఫరీరా మాత్రం వ్యతిరేకిస్తున్నారు. శ్రీలంక రూపాయికి సమానంగా భారత రూపాయిని వినియోగించం సరైంది కాదని అంటున్నారు. శ్రీలంకలో రెండో రూపాయిగా భారత్ కు చెందిన కరెన్సీ ఉండొద్దని అంటున్నారు. కానీ ఇప్పటికే జింబాబ్వే, ఎల్ సాల్వడార్ వంటి అనేక దేశాలు రెండు కరెన్సీలు వాడుతున్నాయి. అయితే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.