Begin typing your search above and press return to search.
దేశాధ్యక్షుడి మీద జోస్యం.. జైలుకెళ్లేలా చేసింది
By: Tupaki Desk | 2 Feb 2017 5:17 AM GMTఆ జ్యోతిష్యుడికి పెద్ద కష్టమే వచ్చింది. తనకు తెలిసిన శాస్త్రాన్ని చెప్పినదానికి అడ్డంగా బుక్ అయ్యాడు. ఎందుకలా అంటే..? సదరు జ్యోతిష్యం చెప్పింది ఎవరి మీదనో కాదు.. ఏకంగా దేశాధ్యక్షుడి మీదే చెప్పేశాడు. శ్రీలంకకు చెందిన విజిత రోహన విజేముని అనే జ్యోతిష్యుడు ఉన్నాడు. అతగాడు జ్యోతిష్యం చెప్పి బతికేస్తుంటాడు.
ఆ వ్యక్తి.. ఈ మధ్యన శ్రీలంక దేశాధ్యక్షుడు జనవరి 27లోపు అనారోగ్యంతో కానీ.. ప్రమాదం కారణంగా కానీ చనిపోతారంటూ జ్యోతిష్యం చెప్పటం మొదలెట్టాడు. దీంతో.. దేశాధ్యక్షుడ్ని అభిమానించేవారు ఆందోళనకు గురయ్యారు. తన జ్యోతిష్యంలో లెక్క తేడా వస్తే సంగతేమిటన్న విషయాన్ని పట్టించుకోకుండా.. తనకు తెలిసిన విషయాన్ని అదే పనిగా చెప్పటం మొదలెట్టాడు.
చివరకు అతగాడు చెప్పిన జనవరి 27 వెళ్లిపోవటం.. దేశాధ్యక్షుడు క్షేమంగా ఉండటంతో జ్యోతిష్యుడికి పెద్ద కష్టం ఎదురైంది. తప్పుడు జోతిష్యం చెబుతావా? అంటూ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఎందుకలా తప్పుడు ప్రచారం చేస్తావని ప్రశ్నిస్తున్న పోలీసులకు సదరు జ్యోతిష్యుడి నోటి నుంచి మాట రావటం లేదట. దేశాధ్యక్షుడి చావు మాటేమో కానీ.. తాను అలాంటి జోస్యం చెప్పటం ద్వారా జైలుకు వెళతానన్న విషయం జ్యోతిష్యుల వారికి తెలీకపోవటం ఏమిటి చెప్మా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/