Begin typing your search above and press return to search.

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్..బ్యాడ్ న్యూస్

By:  Tupaki Desk   |   17 April 2020 3:01 PM GMT
ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్..బ్యాడ్ న్యూస్
X
అన్నీ ఉన్నో అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ పరిస్థితి. ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, దేశవ్యాప్తంగా స్టేడియాలు.. అభిమానులు ఉన్నా కరోనా కారణంగా వాయిదావేయాల్సిన పరిస్థితి.. ఇన్ని వసతులు.. కోట్ల కొద్దీ డబ్బు.. మందీ మార్బలం ఉన్న భారత్ లో కానిది.. రావణుడు నడియాడన లంకలో సాధ్యమవుతుందా? అంటే సాధ్యమేనంటోంది శ్రీలంక క్రికెట్ బోర్డు.. తమ దేశంలో అస్సలు కరోనా లేదని చెబుతోంది.

అయితే అది కరోనా.. దేశం నుంచి దేశానికి ఈజీగా రాగలదు. పైగా విదేశీ క్రికెటర్లు రావాలి. వారితోపాటు కరోనా కూడా వెంటబెట్టుకొని వచ్చేస్తుంది. ముఖ్యంగా యూరప్ నుంచి బ్రిటన్ ఆటగాళ్లు రావాలి. అక్కడ కరోనా తీవ్రంగా ఉంది. పైగా విమానాలు కూడా నడవడం లేదు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా తగ్గాక కూడా ఐపీఎల్ నిర్వహించడం కష్టమేనన్న భావనతో బీసీసీఐ దీని గురించే ప్రస్తుతానికి ఆలోచించడం లేదు.

అయితే తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఐపీఎల్ కు తాము ఆతిథ్యం ఇస్తామంటూ బీసీసీఐకి ఆఫర్ ఇచ్చింది. భారత్ లో కంటే శ్రీలంకలో కరోనా ప్రభావం చాలా తక్కువ. భారత్ లో 13000 కేసులు నమోదైతే.. శ్రీలంకలో కేవలం 238 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో జూన్ వరకు తమ దేశంలో కరోనా ఉండదని తాము ఆతిథ్యం ఇస్తామని శ్రీలంక ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు లంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా బీసీసీఐకి త్వరలోనే లేఖ రాస్తున్నట్టు తెలిపారు.

అయితే శ్రీలంక ఆఫర్ పై బీసీసీఐ స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ ప్రస్తుతం అసాధ్యమని బీసీసీఐ బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఐపీఎల్ నిర్వహణపై ఏం ఆలోచించట్లేదని స్పష్టం చేశారు. అయినా లంకలో కేవలం మూడు స్టేడియాలు మాత్రమే ఉన్నాయని.. అవి 8 ఐపీఎల్ ప్రాంచైజీలకు ఏమాత్రం సరిపోవని తెలిపారు. వనరులు లేని కారణంగా లంకలో ఐపీఎల్ నిర్వహణ తలకు మించిన భారమన్నారు. విదేశీ ఆటగాళ్లతో కరోనా ప్రబలితే మొత్తానికే ఎసరు వస్తుందని.. ప్రస్తుతానికి కరోనా నేపథ్యంలో ఐపీఎల్ గురించే బీసీసీఐ ఆలోచించని పరిస్థితి నెలకొంది.