Begin typing your search above and press return to search.

దేశభక్తి ఎవడిక్కావాలె..నాలుగు పైసలొస్తే చాలు!

By:  Tupaki Desk   |   13 April 2016 5:02 PM GMT
దేశభక్తి ఎవడిక్కావాలె..నాలుగు పైసలొస్తే చాలు!
X
అంతే... ఆ క్రికెటర్‌ ప్రస్తుతం ఆచరణలో పెడుతున్న సిద్ధాంతం మాత్రం అదే. దేశం.. దేశ ప్రజలు తన గురించి ఏమైనా అనుకోనీ.. తాను మాత్రం సొమ్ములొచ్చే మార్గాన్ని ఆశ్రయించాలనుకుంటున్నాడే తప్ప.. దేశం కోసం తాను కోరుకుంటున్న దాన్ని త్యాగం చేసే ఉద్దేశంతో లేడు. ఆ క్రికెటర్‌ మరెవ్వరో కాదు. శ్రీలంక జట్టులో అద్భుతాలు సృష్టించే స్పిన్నర్‌ లసిత్‌ మలింగ. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ లో మలింగ ఆడడం - ఆడకపోవం కు సంబంధించిన వివాదం.. ఆ క్రికెటర్‌ ఏకంగా తన పూర్తిస్థాయి అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ కే ఫుల్‌ స్టాప్‌ పెట్టేంత వరకు ముదిరిపోతున్నది.

మలింగ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ లో ఆడాలంటే అతను తమ శ్రీలంక క్రికెట్‌ బోర్డు నుంచి అనుమతి పత్రం లేదా నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ లాంటిది తీసుకురావాలి. అయితే ఐపీఎల్‌ లో ఆడడానికి వీల్లేదంటూ శ్రీలంక క్రికెట్‌ బోర్డు కట్టడి చేస్తున్నది. లసిత్‌ మలింగ ఈ విషయంలో బోర్డుతో గొడవ పెట్టుకుని.. వ్యవహారాన్ని ఇప్పటికే చాలా దూరం తీసుకువెళ్లాడు.

బోర్డు ఇదే మాదిరి గతంలో కూడా ఐపీఎల్‌ ఆడనివ్వకుండా అడ్డు పడడంతో, మలింగ తన టెస్ట్‌ క్రికెట్‌ కెరీర్‌ నుంచి ఒకేసారి రిటైర్‌ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే మాదిరిగా బోర్డు మళ్లీ అడ్డు పడుతోంది. అయితే మలింగ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్‌ లో ఆడాల్సిందే అనే నిర్ణయంతో ఉన్నాడు. అనుమతి ఇవ్వకపోతే గనుక.. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి పర్మినెంట్‌ గా రిటైరవుతానని, ఇక దేశం తరఫున ఏ ఫార్మాట్‌ లోనూ ఆడేది ఉండదని మలింగ బోర్డును బెదిరిస్తున్నాడు. అయితే మలింగ మరియు శ్రీలంక బోర్డు మధ్య ఏర్పడిన ఈ ప్రతిష్టంభన ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఐపీఎల్‌ లో తన రేటు బాగా ఎక్కువ ఉండడం, బోర్డు ఫీజులు ఆ స్థాయిలో తనకు లాభసాటి కాకపోవడం వల్లనే మలింగ ఇలాంటి నిర్ణయానికి వస్తున్నట్లు, దేశం కోసం ఆడడం కంటె దీన్నే ఎంచుకుంటున్నట్లు పలువురు భావిస్తున్నారు.