Begin typing your search above and press return to search.
నౌకాశ్రయం లో దాక్కున్న లంక ప్రధాని.. మహిందకు ప్రాణ భయం!
By: Tupaki Desk | 11 May 2022 8:28 AM GMTశ్రీలంకలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రధాని పదవికి మహీంద రాజపక్స రాజీనామా చేసినా.. దేశంలో ఆగ్రహజ్వాల చల్లారట్లేదు. అస్థిరత వీడట్లేదు. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల ఘర్షణతో లంక అట్టుడుకుతోంది. ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఉందన్న అంతర్జాతీయ సంస్థలు, మీడియా హెచ్చరికలతో శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స.. నౌకాశ్రయంలోని ఓ రహస్య గదిలో దాక్కున్నారు. అయితే.. ఈ విషయం తెలిసి.. ఆందోళన కారులు.. ఆ నౌకాశ్రయాన్ని కూడా చుట్టుముట్టారు.
మరోవైపు.. దేశంలో రాజకీయ ప్రతిష్టంభనకు ముగింపు పలికే దిశగా పార్టీ అసమ్మతి వాదు లు, ప్రధాన ప్రతిపక్ష నేతలతో చర్చించనున్నారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. అటు.. శ్రీలంకకు భారత్ నుంచి బలగాలను పంపిస్తోందన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అదేసమయంలో లంక ప్రజాప్రనిధితులు.. ముఖ్యంగా రాజపక్సపార్టీ నేతలు భారత్కు వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ వార్తలను భారత్ నిర్ధారించలేదు.
కొనసాగుతున్న హింస!ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక.. అవిశ్రాంత నిరసనలతో హోరెత్తుతోంది. అల్లర్లు, హింసాత్మ క ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలతో దేశమంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం జరిగిన రణరంగంలోనే 8 మంది చనిపోయారు. 200 మంది కిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. హింసను విడనాడాలని, ఏకాభిప్రాయంతో రాజకీయ స్థిరత్వానికి కృషి చేయాలని అన్నారు.
ప్రధానమంత్రి మహీంద రాజపక్స రాజీనామా అనంతరం.. రాజకీయ ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు చర్యలు చేపట్టారు గొటబాయ రాజపక్స. అధికార పార్టీ తిరుగుబాటుదారులు సహా ప్రధాన ప్రతిపక్షం ఎస్జేబీ నేతలతో బుధవారం సమావేశం నిర్ణయించారు. మహీంద తర్వాత తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై చర్చించనున్నారు. శ్రీలంక కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. విదేశీమారక నిల్వలు నిండుకోగా.. విదేశాల నుంచి దిగుమతులకూ నగదు చెల్లించే పరిస్థితి లేదు.
ఇది తీవ్రమైన కొరత, అధిక ధరలకు దారి తీసింది. పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, అధికార నేతలు రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మహీంద మద్దతుదారులు.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై దాడికి దిగారు. అనంతరం.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించి.. సైనిక బలగాలను మోహరించాల్సి వచ్చింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. తన ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేశారు 76 ఏళ్ల మహీంద రాజపక్స.
శ్రీలంక మాజీ ప్రధాని రాజపక్స సహా అధికారపక్ష నేతలకు నిరసన సెగ తగులుతోంది. దీంతో వారిలో కొందరు దేశం విడిచి భారత్ పారిపోయినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కథనాలను కొలంబోలోని భారత హైకమిషన్ ఖండించింది. ''శ్రీలంకకు చెందిన కొందరు రాజకీయ నేతలు వారి కుటుంబాలతో సహా భారత్‌కు పారిపోతున్నారని కొన్ని మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ నిరాధార, అవాస్తవమైన కథనాలు. వీటిని హైకమిషన్ తీవ్రంగా ఖండిస్తోంది.'' అని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.