Begin typing your search above and press return to search.
శ్రీరామ భూమి పూజ.. అద్వానీ, జోషికి నో ఎంట్రీ
By: Tupaki Desk | 1 Aug 2020 11:39 AM GMTఆగస్టు 5న ప్రతిష్టాత్మక అయోధ్యలో శ్రీరామ ఆలయ నిర్మాణానికి భూమి పూజను భారత ప్రధాని నరేంద్రమోడీ చేతులు మీదుగా చేయబోతున్నారు. దీంతో హిందువులందరిలోనూ ఒకరకమైన భావోద్వేగం కనిపిస్తోంది.
అయితే అద్భుతమైన ఈ వేడుకకు నాడు ఇదే ప్లేసులో ఉన్న బాబ్రీ మసీదు కూల్చివేతలో నిందితులుగా ఉన్న అద్వానీ, జోషి, ఉమాభారతిలకు ఎంట్రీ ఉంటుందా.. మోడీ ఈ బీజేపీ కురువృద్ధులను రానిస్తాడా? అన్న అనుమానాలు చెలరేగాయి.
కానీ ఈ వేడుకకు ఇప్పటివరకు కేంద్రమాజీ మంత్రి ఉమాభారతికి మాత్రమే అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం పంపింది. ఇక మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ కు కూడా ట్రంప్ ఆహ్వానించింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతలో తాము ఎలాంటి విచారమూ వ్యక్తం చేయడం లేదని వారిద్దరూ ఇప్పటికే ప్రకటించారు.
మరో వైపు ఈ కేసులో ప్రధాన ఆరోపణలున్నా అద్వానీ, మురళీ మనోహర్ జోషికి మాత్రం ట్రస్ట్ ఇప్పటివరకు ఆహ్వానాలు పంపకపోవడం.. వారి జీవితం అంతా ఈ అయోధ్య-బాబ్రీ వివాదం చుట్టే తిరిగినా వారిని దగ్గరకు రానీయకపోవడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.