Begin typing your search above and press return to search.
శ్రీరామ సేన అధ్యక్షుడి దుర్మార్గపు మాటలు
By: Tupaki Desk | 18 Jun 2018 4:20 AM GMTనోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఇప్పటి ట్రెండ్. ప్రజల్ని ప్రభావితం చేసే స్థానాల్లో ఉన్న వారు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి.. తీవ్ర చర్చకు కారణమైన ఒక ఉదంతానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే.. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? కానీ.. అవేమీ పట్టవని.. కేవలం సంచలనం తప్పించి తమకు మరేమీ పట్టదన్నట్లుగా వ్యవహరించటం.. తాము వ్యతిరేకించే వారిని నీచంగా అభివర్ణించటమే తనకు తెలుసన్నట్లుగా వ్యవహరించి సంచలనం సృష్టిస్తున్నారు.
ప్రముఖ జర్నలిస్టు.. మానవతావాది గౌరీ లంకేశ్ ను దారుణంగా హతమార్చిన వైనంపై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైనం తెలిసిందే. ఈ విషయంపై శ్రీరామ సేన అధ్యక్షుడు బెంగళూరులో జరిగిన ఒక సభలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. ఛీ.. ఛీ.. ఇలా కూడా మాట్లాడతారా? అంటూ చికాకు తెప్పించేలా ఉండటం గమనార్హం. ఇంతకూ ఆయనేం మాట్లాడారు? అన్నది చూస్తే..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కర్ణాటకలో ఇద్దరు.. మహారాష్ట్రలో ఇద్దరు హత్యకు గురైన వారి గురించి ఎవరూ నోరు ఎత్తటం లేదని.. గౌరీ లంకేశ్ హత్య పై మాత్రం ప్రధాని మోడీ స్పందించాలంటున్నారంటూ మండిపడ్డారు. కర్ణాటకలో ఒక కుక్క పోతే..దానికి మోడీ ఎందుకు స్పందించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి.. దాటకూడని గీతలన్నీ ఒక్కసారిగా దాటేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న వేళ.. జరిగిన హత్యలకు న్యాయం జరిగాలని డిమాండ్ చేయటం తప్పు కాదు. కానీ.. ఆ హత్యలకు న్యాయం జరగలేదని.. మరో దారుణ ఘటనను చిన్నబుచ్చేలా.. చులకన చేసేలా మాట్లాడటం కూడా సరికాదు. మానవత్వం ఉన్నటోళ్లు ఎవరూ మాట్లాడని రీతిలో వ్యాఖ్యలు చేసిన ఈ వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారటం.. తనను గుడ్డిగా వెనకేసుకొచ్చే వారు సైతం తప్పు చేశావంటూ వేలెత్తి చూపటంతో గొంతు సవరించుకున్న శ్రీరామ సేన అధ్యక్షుడు.. తాను గౌరీ లంకేశ్ పై చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని.. తాను ఆమెనుఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని సమర్థించుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గౌరీ లంకేశ్ ను హతమార్చిన ఉదంతంలో ప్రధాన నిందితుడైన వాఘ్ మారెతో శ్రీరామ సేన అధ్యక్షుడు గతంలో ఫోటోలు దిగటాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు.