Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డి వెనుక వైసీపీ లేదు:తమన్నా సింహాద్రి
By: Tupaki Desk | 19 April 2018 8:10 AM GMTజనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ను నటి శ్రీరెడ్డి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, పవన్ వంటి స్టార్ ను తిట్టడం వల్ల మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయని, పవన్ ను అలా అనమని తానే శ్రీరెడ్డికి సలహా ఇచ్చానని వర్మ స్వయంగా అంగీకరించడం కలకలం రేపింది. కేవలం శ్రీరెడ్డి ఉద్యమం మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆ సలహా ఇచ్చానని, ఇందులో శ్రీరెడ్డి తప్పు లేదని వర్మ క్లారిటీ ఇచ్చారు. శ్రీరెడ్డిని తానే ప్రభావితం చేశానని, అందుకే దానికి నైతిక బాధ్యత వహిస్తూ పవన్ కల్యాణ్ కు, పవన్ ను దూషించినందుకు బాధ పడ్డ ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నానని వర్మ ఓ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. అయితే, పవన్ ను శ్రీరెడ్డి టార్గెట్ చేయడం వెనుక వర్మతో పాటు కొందరు వైసీపీనేతలు కూడా ఉన్నారని,రాజకీయంగా పవన్ ను దెబ్బకొట్టేందుకే ఈ రకమైన పనులకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. శ్రీరెడ్డికి సన్నిహితురాలైన నటి తమన్నా సింహాద్రికి వైసీపీ నేతలతో పరిచయాలున్నాయని, ఆమె ద్వారానే పవన్ ను శ్రీరెడ్డి టార్గెట్ చేసిందని పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.....ఆ వ్యాఖ్యలను తమన్నా సింహాద్రి ఖండించారు. పవన్ ను శ్రీరెడ్డి టార్గెట్ చేయడానికి వర్మ కారణమని, వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా సింహాద్రి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనతో శ్రీరెడ్డి మాట్లాడిన ఆడియో టేప్ ను లైవ్ లో తమన్నా వినిపించింది.
తన బాబాయి ఒకాయన వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గతంలో పోటీ చేశారని, ఆయనతో తాను దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని, వాటిని కొందరు మిస్ యూజ్ చేసి ఈ రకమైన పుకార్లు సృష్టించారని తమన్నా చెప్పారు. వైసీపీకి తనకు ఏమాత్రం సంబంధం లేదని, తానెపుడూ వైసీపీ జెండా కూడా పట్టుకోలేదని అన్నారు. తన ఫొటోలను దుర్వినియోగం చేయడం పద్ధతి కాదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని, పోలీసు కేసులు పెడతానని తమన్నా తెలిపింది. స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీపై బురద జల్లేందుకు కొంతమంది చూస్తున్నారని చెప్పింది. ఒక రెపుటేషన్ ఉన్న పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్రపన్నడం సరికాదని తమన్నా మండిపడింది. శ్రీరెడ్డి చెప్పిన ఆడియోను తమన్నా లైవ్ లో వినిపించింది. ``అంతా ప్లాన్ చేశారు. పవన్ ను అలా తిట్టమని వర్మ చెప్పారు. ఇపుడు ప్లేట్ తిప్పేశాడు. ఒక చోట రూ.5 కోట్లు ఇస్తారు వెళ్లి పుచ్చుకో అన్నాడు. నేను పుచ్చుకోను అని చెప్పాను. పవన్ ను అన్న ఒక్క మాట వల్ల ఉద్యమం అంతా నీరుగారి పోయింది. ఆ మాట అనడంతో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు``అని తమన్నాతో శ్రీరెడ్డి వాపోయిన ఆడియో టేప్ లైవ్ లో వినిపించింది.
వీడియో కోసం క్లిక్ చేయండి