Begin typing your search above and press return to search.
గులాబీ ఎమ్మెల్యే అలా చేశాడన్న టాలీవుడ్ నటి
By: Tupaki Desk | 14 Oct 2018 6:20 AM GMTఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న మీటూ వ్యవహారం రేపుతున్న రాజకీయ అలజడి అంతా ఇంతా కాదు. సినిమా రంగమే కాదు.. ఇప్పుడు అన్ని రంగాలకు సంబంధించిన లైంగిక ఒత్తిళ్లు.. వేధింపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మీటూపై తెలుగు నేల పెద్ద ఎత్తున ఉద్యమంలా నడిపే ప్రయత్నం చేసి.. తన తొందరపాటుతో అనవసర రచ్చగా మార్చిన ఘనత టాలీవుడ్ నటి శ్రీరెడ్డి.
టాలీవుడ్లో లైంగిక వేధింపుల పై ఆమె చేసిన సంచలన ఆరోపణల్ని మర్చిపోలేం. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖుల మీద ఆమె చేసిన ఆరోపణలు అన్నిఇన్ని కావు. పవన్ ను ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన ఒక తప్పుడు వ్యాఖ్యతో ఆమె పోరాటం మొత్తం వెనక్కి వెళ్లింది. అనంతరం ఆమె హైదరాబాద్ నుంచి చెన్నై షిఫ్ట్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. తాజాగా తమిళనాడు లోని ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె భారీ బాంబు పేల్చారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె వెల్లడించారు.
టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉమనైజర్ అని.. పార్క్ హయ్యత్ లో అతనికి పర్మినెంట్ గా ఒక రూం ఉందని చెప్పారు. తన ముందు డ్రగ్స్ ను తీసుకోవటమే కాదు.. తన పర్సనల్ గన్ కూడా చూపించినట్లుగా ఆమె వెల్లడించారు. తనను జీవన్ రెడ్డి కోరుకున్నట్లుగా ఆమె వెల్లడించారు. తాను నోరు తెరిస్తే టీఆర్ఎస్ పార్టీలోని పలువురు నేతలకు ఇబ్బందన్న విషయాన్ని తాను గతంలోనే చెప్పినట్లుగా పేర్కొన్నారు.
ప్రత్యేక ఇంటర్వ్యూతో పాటు.. మరికొన్ని సంగతుల్ని ఆమె ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. కేసీఆర్.. కేటీఆర్ లకు తాను గతంలోనే విన్నవించానని.. కావాలంటే వారు తన పాత పోస్టులను ఒకసారి చూడాలన్నారు. టీఆర్ఎస్ పార్టీలో అందరు నేతలు చెడ్డవారని చెప్పట్లేదని..కొందరు మాత్రమేనన్నారు. తన మీదకు పవన్ ను ప్రయోగించి మీటూ ఉద్యమాన్ని ఖతం చేశారన్న శ్రీరెడ్డి.. టీఆర్ఎస్ నేతలు తలుచుకుంటే తన పరిస్థితి ఏమిటి? అన్న భయాన్ని వ్యక్తం చేస్తూనే.. ఫర్లేదన్న ధీమాను ప్రదర్శించటం గమనార్హం. గడిచిన కొంతకాలంగా తెలుగు ప్రాంతానికి చెందిన ప్రముఖలపై ఆరోపణల్ని సంధించని శ్రీరెడ్డి.. తాజాగా అధికారపార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే పేరును ఓపెన్ గా చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది.