Begin typing your search above and press return to search.
చట్టాలు ఉంటాయి శ్రీరెడ్డి..ఎక్కడపడితే అక్కడ విప్పకూడదు
By: Tupaki Desk | 7 April 2018 10:14 AM GMTటాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ దగ్గర మొదలై.. తనకు "మా" సభ్యత్వం కార్డు రాకుండా అడ్డుకుంటున్నారంటూ వరుస ఆరోపణలు చేస్తున్న వైనం తెలిసిందే. తనకు "మా" సభ్యత్వం కార్డు రాకుండా చేస్తున్న వైనంపై వినూత్న నిరసనలో భాగంగా.. అర్థనగ్నంగా ఫిలింఛాంబర్ ముందు ప్రదర్శన చేయటం సంచలనం సృష్టించింది.
ఒక సినీ నటి ఇలా రోడ్డు మీద బట్టలు విప్పి.. ముప్పాతిక భాగం నగ్నంగా నిరసన చేయటం హైదరాబాద్ మహానగరంలో ఇదే తొలిసారి. ఇప్పటివరకూ టీవీ స్టూడియోల్లో కూర్చొని సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ఆమె.. చివరకు రోడ్డు మీద ఇంత సంచలనం సృష్టిస్తారని ఎవరూ అనుకోలేదు.
సినీ వర్గాలకు షాకిచ్చిన శ్రీరెడ్డి.. తానేం చేస్తే సినీ పెద్దలకు అర్థమవుతుందన్న విషయం అర్థం కాకనే ఈ విధంగా నిరసన చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. నా బట్టలు నేను విప్పిస్తే తప్పేంటి? తెలుగు ఇండస్ట్రీ దారుణాతి దారుణ స్థితిలో ఉందని తెలియజేయటానికే బట్టలు విప్పేయాల్సి వచ్చిందన్నారు.
తానింత చేసినా "మా" పెద్దలు స్పందించటం లేదన్నారు. తనకు న్యాయం చేసేందుకు పెద్ద హీరోలు.. బడా ప్రొడ్యూసర్లు కూడా రియాక్ట్ కాకపోవటం బాధాకరమన్న ఆమె.. ఇంకెన్ని రోజులు ఈ పెద్దలు ఉంటారు? ఇండస్ట్రీలో పెత్తందారి వ్యవస్థ నడుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతా బాగానే ఉంది కానీ.. శ్రీరెడ్డి మర్చిపోతున్న విషయం ఏమిటంటే.. నిరసన తెలియజేయటానికి చాలా మార్గాలే ఉన్నాయి.. అందుకు బట్టలే విప్పతీయాల్సిన అవసరం లేదు. అసభ్యంగా వ్యవహరించటం కూడా నేరమే అన్నది చట్టం చెబుతోందని గుర్తించుకోవాలి. శ్రీరెడ్డి నిరసన అసభ్యంగా లేని పక్షంలో.. మీడియాలో ఆమె వార్తను ప్రచురించే సమయంలో ఆమె ఫోటోను బ్లర్ చేయటం.. కొన్ని భాగాలు కనిపించకుండా బ్లాక్ చేయటం లాంటివి ఎందుకు చేశారు? అన్నది చూసైనా శ్రీరెడ్డి కాస్త ఆలోచిస్తే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.