Begin typing your search above and press return to search.
పెద్దమనిషిగా వెళ్లి ‘గురువు’గారు బుక్ అయ్యారా?
By: Tupaki Desk | 8 Feb 2016 6:00 AM GMTకొన్ని విషయాలకు వీలైనంత దూరంగా ఉండటానికి మించిది లేదు. ఈ తత్వం ప్రఖ్యాత అధ్యాత్మిక గురువు.. నోబుల్ శాంతి పురస్కారం రేసులో ఉన్నట్లు చెబుతున్న శ్రీశ్రీ రవిశంకర్ కు ఇప్పుడు అర్థమవుతుందేమో. మహారాష్ట్రంలో ప్రఖ్యాత దేవాలయమైన శని శింగనాపూర్ లో మహిళలకు ప్రవేశం కల్పించటంపై జరుగుతున్న వివాదంలో మధ్యవర్తిగా.. పెద్దమనిషిగా రవిశంకర్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
కొన్ని దశాబ్దాలుగా శని శింగనాపూర్ దేవాలయంలోకి మహిళల్ని అనుమతించరు. దీన్ని వ్యతిరేకిస్తూ తాజాగా కొన్ని ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో.. ఈ సమస్యకు పరిష్కారం సూచించాలంటూ రవిశంకర్ ను కోరారు. దీంతో ఆయన ఈ ఇష్యూలోకి ఎంటర్ అయి.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆయన చెప్పిన సొల్యూషన్ కు అసంతృప్తి వ్యక్తం కావటం.. ఆయన మాటలకు నో అన్న సమాధానం రావటంతో ఈ ఇష్యూలోకి ‘గురువుగారు’ అనవసరంగా ఎంటర్ అయ్యారని ఆయన భక్తులు ఫీలవుతున్న పరిస్థితి.
ఇంతకీ రవిశంకర్ చెప్పిన పరిష్కారం ఏమిటంటే.. తిరుపతి శ్రీవారి ఆలయంలో మాదిరి శనీశ్వరాలయం గర్భగుడిలోకి అర్చకులను తప్పించి పురుషులు.. మహిళలు ఎవరిని అనుమతించకూడదని ఆయన సూచించారు. ఈ సూచనపై ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సరికొత్త ప్రతిపాదన చేస్తున్నారు. దీని ప్రకారం.. భవిష్యత్తులో ఎవరిని ఎంటర్ కాకుండా నిర్ణయం తీసుకునేటట్లైయితే. . చివరిసారిగా రవిశంకర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సమక్షంలో గర్భగుడిలో చివరి పూజ చేసే అవకాశం భూమాత బ్రిగేడ్ కార్యకర్తలకు ఇవ్వాలంటూ కొత్త పాయింట్ బయటకు తీయటంతో.. ఈ వ్యవహారంలో రవిశంకర్ అనవసరంగా ఎంటర్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. మరి.. దీని నుంచి గురువుగారు ఎలా బయటపడతారో..?