Begin typing your search above and press return to search.

అమెరికాలో భార‌త సంత‌తి జ‌డ్జి న‌వ చరిత్ర!

By:  Tupaki Desk   |   20 Feb 2020 3:39 PM GMT
అమెరికాలో భార‌త సంత‌తి జ‌డ్జి న‌వ చరిత్ర!
X
భార‌తీయ సంత‌తికి చెందిన శ్రీ‌శ్రీ‌నివాస‌న్ అమెరికాలో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు. అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత అత్యంత శక్తివంతమైన కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా రెండోసారి నియమితులైన శ్రీ‌శ్రీ‌నివాస‌న్(52) న‌యా రికార్డు క్రియేట్ చేశారు.

అమెరికా ఫెడరల్ సర్క్యూట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రెండోసారి నియమితులైన తొలి దక్షిణాసియా వాసిగా భారతీయ జడ్జ్ శ్రీశ్రీనివాసన్ చరిత్ర సృష్టించారు. ఫెడరల్ సర్క్యూట్ కోర్టును అమెరికా సుప్రీంకోర్టు తర్వాత అత్యంత శక్తివంతమైందిగా భావిస్తారు. ఒబామా హయాంలోనే డీసీ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ శ్రీనివాసన్..ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి రేసులోనూ ఉన్నారు. తాజాగా రెండోసారి ఆయనను ఫెడరల్ సర్క్యూట్ కోర్టు చీఫ్ జస్టిస్‌ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

మారిక్ గార్లాండ్ జడ్జ్‌ గా గ‌తంలో శ్రీ‌శ్రీ‌నివాస‌న్ విధులు నిర్వర్తించారు. డీసీ సర్క్యూట్ కోర్టులో 1997 నుంచి న్యాయమూర్తిగా ఉన్న శ్రీ‌శ్రీ‌నివాస‌న్‌......2013లో ఒబామా హ‌యాంలో చీఫ్ జస్టిస్‌ గా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టుకు గ్యార్లాండ్ నుంచి శ్రీ‌శ్రీ‌నివాస‌న్‌ ను ఒబామా నామినేట్ చేయ‌గా....సెనేట్‌ లో రిపబ్లికన్లు అడ్డుపుల్ల వేశారు. మే 2013లో డిస్ట్రిక్ట్ కొలంబియా సర్క్యూట్‌ కు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి భారతీయ అమెరికన్‌ గానూ శ్రీ‌శ్రీనివాస‌న్ రికార్డు క్రియేట్ చేశారు. భారతీయ సంతతికి చెందిన నియోమీ రావ్‌ను డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే కోర్టులో న్యాయమూర్తిగా నియమించారు.