Begin typing your search above and press return to search.

అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా మనోడు

By:  Tupaki Desk   |   15 Feb 2016 4:26 AM GMT
అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా మనోడు
X
మనోళ్లు చెలరేగిపోతున్నారు. దేశం కాని దేశంలో.. అది కూడా ప్రపంచానికి పెద్దన్న లాంటి దేశంలో కీలక పదవుల్ని చేపడుతున్నారు. అటు కంపెనీల్లో.. ఇటు అమెరికా ప్రభుత్వంలోని పలు కీలక స్థానాల్లోనూ మనోళ్ల ప్రాతినిధ్యం రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా అలాంటి నియామకమే మరొకటి జరిగింది. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలిసారి ఒక భారతీయ అమెరికన్ కు బాధ్యతలు చేపట్టే అరుదైన అవకాశం దక్కింది.

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన 79 ఏళ్ల ఆంటోనిన్ స్కేలియా ఆదివారం హఠాన్మరణం చెందారు. దీంతో.. ఆయన స్థానంలో ఒబామా సర్కారు శ్రీకాంత్ శ్రీ శ్రీనివాస్ ను స్కేలియా స్థానంలో నియమించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్ లో జన్మించిన శ్రీనివాసన్ పేరు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యే జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన పేరునే ఒబామా సర్కారు ఓకే చేస్తుందంటున్నారు.

మితవాద న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన శ్రీనివాసన్ కు అటు డెమోక్రాట్లు.. ఇటు రిపబ్లికన్ ల మద్దతు ఉండటంతో అతని నియామకం పక్కా అన్న మాట వినిపిస్తోంది. అమెరికా దేశ అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తుల జాబితాలో శ్రీనివాసన్ పేరు ఉన్నట్లు.. ఆయన ఎంపిక దాదాపుగా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది.

ఇక శ్రీనివాసన్ విషయానికి వస్తే.. స్టాన్ ఫోర్డ్ వర్సిటీ నుంచి డిగ్రీ చేసిన శ్రీనివాసన్ తల్లిదండ్రులు 1960లలో అమెరికాకు వెళ్లారు. బాస్కెట్ బాల్ క్రీడాకారుడైన శ్రీనివాసన్ నియామకం ఓకే అయితే.. అమెరికాలోని అత్యున్నత స్థానాల్లో ఉన్న మనోళ్లలో శ్రీనివాసన్ ముఖ్యులవుతారు.