Begin typing your search above and press return to search.
మళ్లీ మొదటికి వచ్చిన శ్రీదేవి డెత్ మిస్టరి
By: Tupaki Desk | 26 Feb 2018 8:08 AM GMTఅతిలోక సుందరి మరణంపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది . చనిపోయి 40 గంటలు అవుతున్నా ఆమె ఎందుకు చనిపోయిందనే విషయంపై స్పష్టత ఇచ్చేందుకు దుబాయ్ పోలీసులు డైలామాలో పడుతున్నారు. శ్రీదేవి మరణంపై ఎన్నో అనుమానాలు. మరెన్నో ప్రశ్నలు. వెరసి శ్రీదేవి మృతదేహం దుబాయ్ నుంచి ఇండియా చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందని అరబ్ పోలీసులు చెబుతున్నారు.
ఫోరెన్సిక్ రిపోర్టులో ఆమె బాత్ టబ్ లో మరణించినట్లు తేలింది. అయితే కేసును లోతుగా విశ్లేషించేందుకు దుబాయ్ పోలీసులు ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇప్పుడా కేసుపై ప్రాసిక్యూషన్ అనుమానం వ్యక్తం చేసింది. బాత్ టబ్ లో మరణించిందని ఎలా నిర్ధారిస్తారు..? శ‌్రీదేవిది ప్రమాదమా..? లేక ఆత్మహత్యనా..? అని బోనీ కపూర్ కుటుంబసభ్యుల్ని సైతం ప్రశ్నిస్తున్నారు. దీంతో శ్రీదేవి మరణంపై క్షణం క్షణం అనుమానాలు పెరుగుతున్నాయి.
ప్రపంచం మొత్తం ఆమె బౌతిక కాయం కోసం ఎదురు చూస్తున్నా...అక్కడి ప్రభుత్వం కాలయపన చేయడానికి కారణం శ్రీదేవి మరణించిన తీరేనని అంటున్నారు అధికారులు. బోనీకపూర్ మేనళ్లుడి పెళ్లికి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి దుబాయ్ లోని జుబీరా ఎమరేట్స్ హోటల్ బాత్రూంలో పడి మృతి చెందారు. పెళ్లి తరువాత బోనీ కపూర్ తన చిన్న కూతురు ఖురిషితో కలిసి ముంబైకి వచ్చారు. శ్రీదేవి మాత్రం దుబాయ్ లో ఉండిపోయారు. షెడ్యూల్ ప్రకారం నాలుగు రోజుల తరువాత రావాల్సిన బోనీ కపూర్ శ్రీదేవిని సప్రైజ్ చేసేందుకు అదేరోజు తిరుగు ప్రయాణం అయ్యాడు. జుబీరా ఎమరేట్స్ హోటల్ గదిలో నిద్రిస్తున్న శ్రీదేవి బోనీని చూసిన క్షణంలో సప్రైజ్ అయ్యింది. ఇద్దరు మాట్లాడుకున్న తరువాత ఫ్రెష్ అయి వస్తానని బాత్రూంలో్ కి వెళ్లిన శ్రీదేవి ఎంతకి బాత్రూం నుంచి భయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బోనీ హోటల్ సిబ్బందితో ఆ బాత్రూం డోర్ ను బ్రేక్ చేశారు. అయితే బాత్రూంలో చలనం లేకుండా పడి ఉన్న శ్రీదేవిని చూసి అంతా షాక్ అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు డాక్టర్లు.
కానీ దుబాయ్ మీడియా మాత్రం అనేక అనుమానాల్ని వ్యక్తం చేస్తూ కథనాల్ని ప్రసారం చేసింది. శ్రీదేవి బాత్రూంలో పడి చనిపోయినప్పుడు ముందుగా చూసింది ఆహోటల్ సిబ్బందేనని - బోనీ కపూర్ ఇండియాలో ఉన్నారంటూ కొన్ని అనుమానాల్ని వ్యక్తం చేస్తూ - కొన్ని ప్రశ్నలు సంధించింది.
దీంతో డైలామాలో పడ్డ దుబాయ్ ప్రభుత్వం శ్రీదేవి ఎందుకు మరణించింది. అనే విషయాన్ని స్పష్టం చేయలేకపోయారు. ఓవైపు ఇండియాలో శ్రీదేవి బౌతిక కాయం ఎదురు చూస్తుంటే ..పలు అనుమానాలకు తావిచ్చేలా అక్కడి అధికారులు శ్రీదేవి మరణంపై క్లారిటీ ఇవ్వలేదు.
పోస్టుమార్టమ్ ఆలస్యం - ఫోరెన్సిక్ రిపోర్టులు అంటూ అభిమానుల్ని అసహనానికి గురిచేశారు.
అయితే ఇప్పుడు ఫోరెన్సిక్ టెస్ట్ రావడం అభిమానులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అరబ్ ఎమిరేట్స్ డిపార్టుమెంట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్ ఫోరెన్సిక్ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో శ్రీదేవి గుండెపోటు వల్ల కాదని - బాత్ టబ్ లో పడిపోవడం వల్ల చని పోయారని క్లారిటీ ఇచ్చింది.
మరి బాత్ టబ్ లో ఎందుకు పడ్డారనే ప్రశ్నకు సమాధానంగా ఆమె శరీరంలో మద్యం ఆనవాళ్లు కూడా ఉన్నట్లు - .. మద్యం తాగడం వల్లే ఆమె ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో మునిగి చనిపోయి ఉంటారని పోలీసులు తేల్చి చెప్పినట్లు - పోలీసులు విడుదల చేసిన నివేదికల్ని అక్కడి మీడియా సంస్థ ‘గల్ఫ్ న్యూస్’ నివేదిక కాపీని గల్ఫ్ న్యూస్ ట్విటర్ లో షేర్ చేసింది.
ఇక శ్రీదేవి మరణంపై మొదట్నుంచి అనుమానం వ్యక్తంచేస్తున్న ఖలీజ్ టైమ్స్ కూడా ఆమె నీటమునిగి చనిపోయిందని పోలీసులు తమకు సమాచారం అందించారని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ వివరాల్ని దుబాయి పోలీసులు దీనిపై ట్విటర్లో వివరాలు వెల్లడించినట్లు ఖలీజ్ టైమ్స్ తెలిపింది.
ఈ నేపథ్యంలో దుబాయ్ పోలీసులు ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ విడుదలైనా ఆమె ఎలా మరణించింది అనే విషయంపై అనుమానం రావడంతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసును లోతుగా విచారణచేపట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు దుబాయ్ పోలీసులు శ్రీదేవి కుటుంబసభ్యుల్ని - హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. బోనీకపూర్ కాల్ డేటాను పరిశీలిస్తుంది. ఆ విచారణ పూర్తి అయ్యే వరకు వారిని ఇండియాకు పంపించటం కష్టమనే తెలుస్తోంది. అంతేకాదు ఈ విచారణలో ఫోరెన్సిక్ రిపోర్టును ఎలా నమ్మాలని కొట్టిపారేసింది.
శ్రీదేవి మరణంపై దుబాయ్ అలా దర్యాప్తు కొనసాగుతుంటే ..భారత్ లో మాత్రం ఆమె మరణంపై అనుమానం తావిచ్చేలా విచారణ కొనసాగుతుంది. శ్రీదేవి మరణంపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు బోనీ కపూర్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అయితే సోదాల్లో భాగంగా బోనీకపూర్ ఇంటికి వచ్చిన డాగ్ స్క్వాడ్ ఆయన ఇంటిని తచ్చాడుతూ కొన్ని ప్రాంతాల్ని తిరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో శ్రీదేవి మరణంపై కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే పలువురు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తూ కొన్ని ప్రశ్నలని సంధిస్తున్నారు.
- ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడిపోవడంతోనే మృతి చెందిందా..?
- బాత్ టబ్ గురించి తెలియని వారు జారిపడొచ్చు. కానీ సెలబ్రిటీ అయిన శ్రీదేవి బాత్ టబ్ ఎలా మునిగి చనిపోతుంది..?
- గుండె పోటుతో చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదు..?
- మద్యం సేవించారని చెబుతున్న దుబాయ్ మీడియా..ఆమె ఆల్కహాల్ తీసుకుంటే అక్కడి ప్రభుత్వం ఎందుకు భయటపెట్టడంలేదు..?
- 36గంటలు గడుస్తున్నా ఆమె ఎందుకు మరణించింది అనే విషయాన్ని ఎందుకు స్పష్టంచేయడం లేదు..?
- ఖలీజ్ టైమ్స్ కథనంతో శ్రీదేవి డెత్ మిస్టరీ కేసు తెరపైకి వచ్చిందా...?
- శ్రీదేవి మరణించిన సమయంలో బోనీ ముంబైలో ఉన్నారనడానికి ఆధారాలేంటి..? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అతిలోక సుందరి మరణం దేశానికి ఓ ప్రశ్నార్ధకంలా మిగిలిపోయింది. చరిత్ర ప్రకారం పలువురి మరణాలు ఇప్పటికి మిస్టరీలుగానే మిగిలిపోయి ఉన్నాయి. అలా శ్రీదేవి మరణం కూడా చరిత్రలో మిగిలిపోతుందా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.