Begin typing your search above and press return to search.

క‌ఠిన వాస్త‌వం: కార్మికుల్ని భ‌ద్ర‌ప‌రిచే చోటే శ్రీ‌దేవి!

By:  Tupaki Desk   |   28 Feb 2018 8:05 AM GMT
క‌ఠిన వాస్త‌వం:  కార్మికుల్ని భ‌ద్ర‌ప‌రిచే చోటే శ్రీ‌దేవి!
X
వినేందుకు క‌ష్టంగా ఉన్న అస‌లు నిజం ఇదే. కోట్లాది మంది మ‌న‌సుల్ని దోచేసిన అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి స‌జీవంగా ఉన్న‌ప్పుడు ఎలా వెలిగిపోయారో తెలిసిందే. త‌న ఇమేజ్ తో ఆమె అనిత‌ర సాధ్య‌మైన శిఖ‌రాల‌కు చేరుకున్నారు. ఆమె ఎంత పెద్ద సెల‌బ్రిటీనో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అలాంటి శ్రీ‌దేవి దుబాయ్ లో ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించ‌టం.. ఆ త‌ర్వాత ఆమె మ‌ర‌ణంపై నెల‌కొన్న సందేహాల్ని తీర్చుకోవ‌టం కోసం దుబాయ్ పోలీసులు ఆమెను మార్చురీలో ఉంచ‌టం తెలిసిందే.

దుబాయ్ ఫోరెన్సిక్ ప్ర‌ధాన కార్యాల‌యంలోని ఫోరెన్సిక్ వారి మార్చురీలో ప్ర‌ముఖుల‌కు ఒక మార్చురి.. సామాన్యుల‌కు ఒక మార్చురీ అంటూ తేడా లేదు. దీంతో.. మృతి చెందిన విదేశీయుల్ని ఉంచే మార్చురీ రూంలోనే ఆమెను ఉంచేశారు. స‌జీవంగా ఉన్న‌ప్పుడు క‌ల‌ల రాణిగా.. ఎవ‌రికి అంద‌నంత దూరాన ఉండే శ్రీ‌దేవి.. ప్రాణం పోయిన త‌ర్వాత అంద‌రి మాదిరే.. సామాన్యుల్ని ఉంచే మార్చురీలోనే ఆమెను భ‌ద్ర‌ప‌రిచిన పెట్టెను ఉంచారు.

శ్రీ‌దేవిని ఉంచిన మార్చురీలో మృతి చెందిన భార‌త కార్మికుల మృత‌దేహాల్ని ఎక్క‌డ భ‌ద్ర‌ప‌రిచారో అక్క‌డే ఉంచారు. మూడు రోజుల పాటు అలానే ఉన్న ఆమె భౌతిక‌కాయాన్ని.. దుబాయ్ ఫోరెన్సిక్ సంస్థ రిపోర్ట్‌.. అనంత‌రం అధికారులు ఆమె కేసును క్లోజ్ చేసిన‌ట్లు చెప్పిన త‌ర్వాత మాత్ర‌మే బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. వారి బంధువుల‌కు అప్ప‌గించారు.

పెద్ద సెల‌బ్రిటీనే కావొచ్చు.. అది ప్రాణం ఉన్నంత‌వ‌ర‌కే. ప్రాణం పోయిన త‌ర్వాత ఎంత పెద్ద వాళ్లు అయినా.. మ‌రెంత చిన్న‌వాళ్లు అయినా అంద‌రూ ఒకేచోటుకు చేర‌తార‌న్న స‌త్యాన్ని శ్రీ‌దేవి మ‌ర‌ణం మ‌రోసారి గుర్తు చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.