Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవికి ఇవాళ ఆ ప్ర‌క్రియ పూర్తి చేస్తారా?

By:  Tupaki Desk   |   27 Feb 2018 4:30 AM GMT
శ్రీ‌దేవికి ఇవాళ ఆ ప్ర‌క్రియ పూర్తి చేస్తారా?
X
శ్రీ‌దేవికి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు దేశ ప్ర‌జ‌ల్ని క‌న్ఫ్యూజ్ చేయ‌ట‌మే కాదు.. ఆమె మృతి పెద్ద మిస్ట‌రీగా మారింది. ఆమెకు సంబంధించి దుబాయ్ మీడియా ఆచితూచి అన్న‌ట్లుగా రియాక్ట్ అవుతూ.. తాను వెల్ల‌డించే ప్ర‌తి విష‌యానికి ఆధారంగా సాక్ష్యాల్ని చూపిస్తుంటే.. అందుకు భిన్నంగా భార‌త్ లో మాత్రం మీడియా త‌న‌దైన రీతిలో వార్త‌ల్ని ప్ర‌సారం చేస్తుంద‌న్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

విషాద‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. శ్రీ‌దేవి మ‌ర‌ణాన్ని మొద‌ట భావోద్వేగ అంశాల‌తో నింపేసిన మీడియా.. ఇప్పుడు ఆమె మృతి మిస్ట‌రీపై ర‌క‌ర‌కాల అనుమానాలు.. సందేహాలు వ్య‌క్తం చేస్తోంది. ఈ హ‌డావుడిలో అస‌లు విష‌యాలు కొన్నింటిని అస్స‌లు ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

శ్రీ‌దేవి మ‌ర‌ణ వార్త శ‌నివారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత బ‌య‌ట‌కు రాగా.. పోమ‌వారం వ‌చ్చిన చాలా ప‌త్రిక‌ల్లో ఆమె మ‌ర‌ణం గురించి.. ఆమె కీర్తి ప్ర‌తిష్ట‌ల గురించి ప్ర‌స్తావించాయే త‌ప్పించి.. దుబాయ్ లో ఆమె మృత దేహం ఎక్క‌డుంది? అక్క‌డేం జ‌రుగుతుంద‌న్న విష‌యాల్ని ప్ర‌స్తావించ‌లేదు. తెలుగులో ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ.. త‌న‌కు తాను ద‌మ్మున్న మీడియాగా చెప్పుకునే వారి ప‌త్రిక‌లో మాత్రం శ్రీ‌దేవికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ అందించారు.

దుబాయ్ చ‌ట్టాలు ఎంత క‌ఠినంగా ఉంటాయ‌న్న విష‌యంతో పాటు.. శ్రీ‌దేవి మ‌ర‌ణానికి ముందు బోనీక‌పూర్ భార‌త్ వ‌చ్చి వెళ్లార‌న్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఇప్పుడు అదే పెద్ద విష‌యంగా మార‌ట‌మే కాదు.. దాని చుట్టూనే విచార‌ణ సాగ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. శ్రీ‌దేవి మ‌ర‌ణం త‌ర్వాత ఆమె దేహానికి పోస్ట్ మార్టం నిర్వ‌హించారు. అనంత‌రం ఫోరెన్సిక్ నివేదిక విడుద‌లైంది.ఇంత జ‌రిగినా కూడా శ్రీ‌దేవి పార్థిప‌దేహానికి ఎంబామింగ్ ప్ర‌క్రియ నిర్వ‌హించ‌లేదు. శ్రీ‌దేవి మ‌ర‌ణంపై అనుమానాలు వ్య‌క్తం కావ‌టం.. అక్క‌డి విచార‌ణ అధికారులు బోనీక‌పూర్ చెప్పిన స‌మాధానాల‌తో సంతృప్తి చెంద‌క‌పోవ‌టంతో ఈ రోజు ఆయ‌న్ను మ‌రోసారి విచారిస్తార‌ని చెబుతున్నారు.

దీనికి బ‌లం చేకూరుస్తూ ఆయ‌న పాస్ట్ పోర్ట్ ను స్వాధీనం చేసుకోవ‌టం.. హోట‌ల్ లో ఉండాల‌ని చెప్ప‌టం జ‌రిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. శ్రీ‌దేవి పార్థిప‌దేహం చెడిపోకుండా ఉండేందుకు నిర్వ‌హించే ఎంబామింగ్ ప్ర‌క్రియ‌ను ఇంకా మొద‌లు పెట్ట‌లేదు. ఆమె మృతిపై విచారిస్తున్న అధికారుల క్లియ‌రెన్స్ వ‌చ్చాక మాత్ర‌మే ఎంబామింగ్ చేస్తార‌ని తెలుస్తోంది. దాదాపు 90 నిమిషాల పాటు ఈ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కాం ఈ రోజు ఎంబామింగ్ ప్ర‌క్రియ పూర్తి అయ్యే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.