Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ఎందుకు బాగుపడదో చెప్పే ట్వీట్ ఇది!
By: Tupaki Desk | 25 Feb 2018 7:38 AM GMTకొంతమంది మారరంటే మారరు. శతాబ్దికి పైనే వయసున్న కాంగ్రెస్ పార్టీకి బాగుపడే సూచనలు సమీపంలో ఉన్నట్లుగా లేదు. నిన్నమొన్నటివరకూ ఆహా మోడీ.. ఓహో మోడీ అన్నోళ్లంతా గడిచిన రెండు నెలలుగా తిట్టిన తిట్టు తిడుతున్న వేళ.. మోడీపై సామాన్యుల్లో పెల్లుబికుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవటంలో కాంగ్రెస్ సక్సెస్ కాలేదు.
హుందాగా వ్యవహరించాల్సిన వేళ.. చిల్లర తీరుతో చులకన అయ్యే తీరు చూస్తే.. కాంగ్రెస్ ను బాగు చేయటం ఇప్పట్లో సాధ్యం కాదేమోనన్న భావన కలగటం ఖాయం. ఇందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ను నిదర్శనంగా చెప్పక తప్పదు. రాష్ట్రపతి.. ప్రధాని మొదలు యావత్ దేశమంతా శ్రీదేవి మరణవార్త షాక్‌కు గురై.. ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో చేసిన ట్వీట్ చూస్తే ఒళ్లు మండక మానదు.
శ్రీదేవి మరణంపై పలువురు సినీ.. రాజకీయ ప్రముఖులు దిగ్భాంత్రి వ్యక్తం చేస్తూ.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సందేశాలు ఇస్తున్నారు. ఇలాంటి వేళ.. కాంగ్రెస్ పోస్ట్ చేసిన ట్వీట్ ఒకటి పలువురి విమర్శలకు గురి అవుతోంది. రాజకీయాల్లో ప్రదర్శించే చిల్లరతనం చివరకు సంతాప సందేశంలోనూ చూపించటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. శ్రీదేవి మరణవార్తపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ.. కాంగ్రెస్ తరఫున తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నట్లుగా పేర్కొంది.
అంతవరకు బాగానే ఉన్నా.. అక్కడే అనవసరమైన కామెంట్ చేసింది. యూపీఏ హయాంలో ఆమెకు 2013లో పద్మశ్రీ దక్కిందని పేర్కొనటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. శ్రీదేవి మరణాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్థి కోసం వాడుకోవాలని చూస్తోందన్న విమర్శను పలువురు చేస్తున్నారు. బాగుపడే రాత లేనప్పుడు ఇలాంటి రాతలే రాస్తారు మరి. శవాలపై పేలాలు ఏరుకోవటం అంటే ఇదేనేమో?