Begin typing your search above and press return to search.
పార్టీ తీరుతో భావోద్వేగానికి లోనైన టీడీపీ ఎంపీ
By: Tupaki Desk | 8 Jun 2020 10:10 AM GMTపార్టీలో జరుగుతున్న పరిణామాలకు ఓ తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు ఆందోళన చెందాడు. తనకు తెలియకుండానే సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు పార్టీ తల్లిలాంటిదని.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శిరోధార్యం అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయనే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఫేక్ అకౌంట్‌తో రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి అధినాయకత్వం చెప్పకుండానే మీడియాలో కథనాలు రాయడం తగదని.. తమ కుటుంబానికి వేరే అజెండా అంటూ ఏమీ లేదని.. పార్టీ తల్లిలాంటిది.. అధినేత మాటే శిరోధార్యం అంటూ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ఇలా ఉంది.. ‘అధినేత మాటే శిరోధార్యం. వారు మా కుటుంబానికి ఓ పెద్ద దిక్కు. వారికి వ్యతిరేకంగా.. కాని వారిని ధిక్కరించి కానీ మాట్లాడడం తగని పని. కానీ కొందరు నా పేరిట ట్విట్టర్ వేదికగా ఫేక్ అకౌంట్ సృష్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారు.. దీనిని వెంటనే గుర్తించాను.. ట్విట్టర్‌కు వెంటనే ఫిర్యాదు చేశా. నా అభిమానులు ఎవరూ ఇలాంటివి చేయరు. నేను ఎన్నడూ పార్టీ విధేయుడిగానే ఉంటా. పార్టీ నియమావళికి దాటి ఉండను.. నా కుటుంబానికి వేరే అజెండా అంటూ ఏమీ లేదు. నాన్న ఎర్రన్న మరణం తర్వాత మా కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది చంద్రబాబే. వారి మాటే శిరోధార్యం. బాబాయి అచ్చెన్న అయినా, నేను అయినా, అక్క భవానీ అయినా వారి మాటలను జవ దాటేది లేదు. మా కుటుంబానికి వేరే అజెండా అంటూ ఏమీ లేదు’ అంటూ ఎమోషనల్ అయ్యారు.
‘సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువుగా ఉంటున్నా. అంతే కానీ ఇదే ఇదే అదునుగా నాకు సంబంధం లేకుండా నా పేరిట నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి ఇలాంటి గందరగోళ వాతావరణానికి కారకులు కావడం తగదు. బాధ్యులు ఎవరైనా చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాల్సిందే. ఈ విషయమై వెనుకంజ వేసేదే లేదు’అంటూ ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా అతడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ, విమర్శలు, ఆరోపణలపై ఈ విధంగా రామ్మోహన్ నాయుడు మనస్తాపం చెందారు. అందులో భాగంగా ఈ ట్వీట్లు చేశారు.