Begin typing your search above and press return to search.
అధికార పార్టీలో 'దువ్వాడ' చిచ్చు..
By: Tupaki Desk | 16 Feb 2020 2:30 AM GMTపోరాటాల జిల్లా శ్రీకాకుళం. ఈ జిల్లాలో రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు వారి పాత్ర అంతా నామమాత్రం కాగా అధికార పార్టీ నాయకుల హవా కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహా తలకాయలు ఉన్నాయి. అయితే ఈ జిల్లాలో అధికార పార్టీ నాయకుల గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఆ పార్టీకి చెందిన నాయకులు అధిక సంఖ్య లో ఉన్నారు. ఒకరిని మించు ఒకరు తామే కింగ్ లమని ప్రకటించుకుంటున్నారు. ఏకం గా జిల్లాను ఏలాలని ప్రయత్నాలు చేస్తుండడంతో ఆ పార్టీ లో విబేధాలు బయటకు పొక్కుతున్నాయి. ఇటీవల ఎగ్జిక్యూటివ్ అధికారి బదిలీ విషయంలో ఇదే జరిగింది. అనంతరం ఇచ్చాపురం మున్సిపాలిటీలో జరిగిన ఘటన కూడా విబేధాల వలనే అని అందరికీ తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ జిల్లా లో ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణితో పాటు దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. మిగతా నలుగురితో ఇబ్బందులు లేవు. కానీ దువ్వాడ శ్రీనివాస్ ఈ నడిమధ్య రెచ్చిపోతున్నారు. శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం దువ్వాడ శ్రీనివాస్ లో పశ్చాత్తాపం ఏమాత్రం లేదు. ఇంకా ఆయన సీఎం జగన్ ప్రతినిధినని, జగన్ ను అపాయింట్ మెంట్ లేకుండా వెళ్లేంత చనువు ఉందని జిల్లాలో ప్రకటించుకుంటూ హల్ చల్ చేస్తున్నాడు. అందుకే ఆయన పార్టీ నాయకులను ఎవర్ని పట్టించుకోవడం లేదు. సీనియర్ నాయకులని గౌరవం కూడా ఇవ్వడం లేదు. ఆయన ప్రజాప్రతినిధి కాకుండానే ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. అతడి అండతో ఆయన సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ కూడా రెచ్చిపోతున్నాడు.
ఈ దువ్వాడ సోదరులు పలాస, ఇచ్చాపురం నియోజకవర్గంలో హవా కొనసాగించాలని చూస్తున్నారు. అందులో భాగంగా అధికారులతో మాట్లాడడం, వీరి జోక్యం తీవ్రమైంది. అక్కడ స్థానిక నాయకులున్నా వీరు పట్టించుకోకుండా తమదైన రీతిలో దూకుడుగా వెళ్తున్నారు. దీంతో సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను చూసుకునే వీరు రెచ్చిపోతున్నారని స్థానికంగా వినిపిస్తున్న మాట. వీరి అతి ప్రవర్తన, ఇతర ప్రాంతాల్లో వీరి జోక్యం విషయమై ఇప్పటికే జగన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దువ్వాడ సోదరుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరుతో పాటు జగన్ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని తెలిపినట్లు సమాచారం. మీరు ఇచ్చిన చనువుతోనే వారు రెచ్చిపోతున్నారని వాపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.